Sanath Nagar Shocker: రూంలో బ్యాచిలర్స్ గొడవ, కూరగాయలు కట్ చేయలేదని ఫ్రెండ్‌పై కత్తితో దాడి, స్నేహితుని పరిస్థితి విషమం, హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

బ్యాచిలర్స్ రూంలో ఉంటున్న ఇద్దరు స్నేహితుల మధ్య కూరగాయలు కట్ చేయడంలో గొడవలు రావడంతో ఓ స్నేహితుడు మరో స్నేహితుడిపై దాడికి పాల్పడ్డాడు.

Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, April 14: హైదరాబాద్ సనత్ నగర్‌లో దారున ఘటన చోటు చేసుకుంది. బ్యాచిలర్స్ రూంలో ఉంటున్న ఇద్దరు స్నేహితుల మధ్య కూరగాయలు కట్ చేయడంలో గొడవలు రావడంతో ఓ స్నేహితుడు మరో స్నేహితుడిపై దాడికి పాల్పడ్డాడు.

హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక హెచ్‌పీ రోడ్ కాలనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైతాస్ ఆలి సల్మాన్, ఫిరోజ్ ఒకే గదిలో ఉంటున్నారు. వీరిద్దరూ ఆరు నెలల నుంచి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

మంగళవారం రాత్రి 10:30 సమయంలో గదికి వారిద్దరు వచ్చారు. వంట కోసం కూరగాయలు కట్ చేసి ఇవ్వమని మైతాస్ ఆలి కోరగా సల్మాన్ ఫిరోజ్ పట్టించుకోలేదు. దీంతో కూరగాయలు కట్ చేసే కత్తితో సల్మాన్ ఫిరోజ్‌పై దాడి చేశాడు. దీంతో ఫిరోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఆన్‌లైన్‌ క్లాస్‌..బాలిక నోరు నొక్కేసి అత్యాచారం, ఆపై వీడియో తీసి పలుమార్లు లైంగిక దాడి చేసిన ఇంటి ఒనర్ కొడుకు, జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో దారుణ ఘటన

వెంటనే ఫిరోజ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

Opposition MPs Protest: జార్జ్ సోర‌స్, అదానీ అంశాల‌తో పార్లమెంటులో గందరగోళం, పార్లమెంట్ ఆవరణలో అదానీ ఇష్యూపై ప్రతిపక్ష ఎంపీల నిరసన

BRS Vinod Kumar: కమీషన్లు అన్నం పెట్టవు..వేల టీఎంసీల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు..సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్

KTR: రైతులపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ..రైతులు ఆశపడతారు కానీ అడుక్కోరు, కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించిన కేటీఆర్...రైతులకు మేలు చేసింది బీఆర్ఎస్ అని వెల్లడి

KTR: రాహుల్ గాంధీ తిట్టడంతోనే వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్, చిట్టినాయుడు చిప్ దొబ్బిందని ఎద్దేవా చేసిన కేటీఆర్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif