Nagarjuna Sagar Project: కృష్ణమ్మ పరవళ్లు, నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్, పర్యాటకుల సందడి

ఎగువ నుండి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ఇన్‌ ఫ్లో అధికంగా ఉండటంతో సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు.

Nagarjuna Sagar dam opened after rise in water level(X)

Nagarjuna Sagar, Aug 5: శ్రీశైలం నుండి నాగార్జున సాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుండి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ఇన్‌ ఫ్లో అధికంగా ఉండటంతో సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు.

2 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు సీఈ, ఇతర అధికారులు. 13, 14 నంబర్ గేట్లను ఎత్తిన అధికారులు. ఇవాళ మధ్యాహ్నం మరో నాలుగు గేట్లను తెరిచారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో:3.75 లక్షల క్యూసెక్కులుగా ఉండగా ఈ సాయంత్రానికి 14 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేయనున్నారు.

Here's Video:

శ్రీశైలం నుండి నాగార్జున సాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుండి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ఇన్‌ ఫ్లో అధికంగా ఉండటంతో సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు.

ఈ రోజు లక్ష నుండి లక్షా 50 వేల క్యూసెక్కుల నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. నాగర్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక పర్యాటకులు సాగర్‌కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో మరో రెండు, మూడు రోజుల్లో నిండనుంది పులించింతల ప్రాజెక్ట్ .