Nagarjuna Sagar Project Gates Open: తెరుచుకున్న నాగార్జునసాగర్ 26 గేట్లు, పర్యాటకుల తాకిడి, నిండుకుండలా మారిన పులిచింతల

శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది.

Nagarjuna Sagar Project 26 Gates lifted, Huge waterflow for Puli Chintala Project(X)

Nagarjuna Sagar, Aug 8: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది.

ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2లక్షల, 73వేల, 370 క్యూసెక్కులుగా ఉండగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 585.40 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ సామర్థ్యం 298.58 టీఎంసీలకు చేరుకుంది.

ఇక నాగార్జున సాగర్‌ నుండి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టు నిండుకుంది. పులిచింతల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో : 2,45, 682 క్యూసెక్కులుగా ఉంది.పులిచింతల ప్రాజెక్టు నీటిమట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 167.94 అడుగులకు చేరుకుంది.  కృష్ణమ్మ పరవళ్లు, నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్, పర్యాటకుల సందడి 

Here's Video

ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 45.77 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 35.50 టీఎంసీల నీరు ఉంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అలాగే కడెం ప్రాజెక్టుకు సైతం భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు గాను 697.125 అడుగులకు నీరు చేరుకుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif