Telangana CM Revanth Reddy Open Letter to Kishan Reddy(X)

Hyd, Feb 28:  కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి(Kishan Reddy) సీఎం రేవంత్ రెడ్డి బహిరంగలేఖ రాశారు(CM Revanth Reddy). రాష్ట్రాలకు ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి ఒక విధానం ఉంటుందని.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ మీరు వ్యాఖ్యలు చేయడం పూర్తి బాధ్యతారాహిత్యం అని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి మీరు కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం, నిధులు మంజూరు చేయించడం మీ నైతిక బాధ్యత. ఇదే విషయాన్ని నేను బహిరంగంగానే పలుమార్లు ప్రకటించాను. రాష్ట్రానికి నిధుల మంజూరుపై ప్రధానమంత్రిని కలిసి వినతులు అందజేయండతో పాటు మిమ్మల్ని స్వయంగా కలిసి అన్నీ వివరించిన తర్వాత కూడా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని.. విధానాన్ని అనుసరించడం లేదని మీరు మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరం అని సీఎం విమర్శించారు.

మాజీ మంత్రి హరీశ్‌ రావుపై మరో కేసు.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు

తెలంగాణలో 2023 డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే పూర్తి బాధ్యాయుతంగా పారదర్శకంగా మా పాలన సాగుతోంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య విధానానికి పూర్తిగా కట్టుబడి ఉండి దానిని అనుసరిస్తున్నాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, ప్రాంతీయ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్టు నుంచి ఏపీలోని బందరు సీ పోర్ట్‌కు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణలకు సంబంధించి అనుమతుల సాధనకు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను పూర్తిగా పాటిస్తున్నాం అన్నారు.

ఆయా ప్రాజెక్టుల సాధనకు సంబంధించి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్సి కలిసిన విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్‌కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు నిర్మించాలని మీతో చర్చించడంతో పాటు ప్రధానమంత్రికి లేఖ అందజేశాను అని సీఎం రేవంత్ లేఖలో రాశారు.