Nalgonda BRS Public Meeting: పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు, నల్గొండ సభలో ధ్వజమెత్తిన కేసీఆర్, తెలంగాణ కోసం ఎందాకైనా వెళతానని స్పష్టం
కేసీఆర్ మాట్లాడుతూ..ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం (I will not allow injustice to Telangana) వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. చలో నల్లగొండ సభ రాజకీయ సభ కానేకాదు.. ఉద్యమ సభ, పోరాట సభ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు.
Nalgonda, Feb 13: నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో (Nalgonda BRS Public Meeting) కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కేశవరావు తదితరులు సభలో పాల్గొన్నారు. కొన్ని నెలల విరామం తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కేసీఆర్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
కేసీఆర్ మాట్లాడుతూ..ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం (I will not allow injustice to Telangana) వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. చలో నల్లగొండ సభ రాజకీయ సభ కానేకాదు.. ఉద్యమ సభ, పోరాట సభ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు.
ఒక్క పిలుపుతో పులులాగా కదిలివచ్చిన అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్లకు ఉద్యమాభివనందనాలు. ఇవాళ నల్లగొండలో చలో నల్లగొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కారణం ఏందంటే.. ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది. నాకు కాలు విరిగిపోయినా కుంటి నడకతోనే, కట్టె పట్టుకోని ఇంత ఆయాసంతో ఎందుకు రావాల్సి వచ్చింది. ఈ విషయం దయచేసి అందరూ ఆలోచించాలి అని కేసీఆర్ కోరారు.
కొందరికి ఇది రాజకీయం. మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ, రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు, నీళ్ల మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన్మరణ సమస్య. చావో రేవో తేల్చే సమస్య. ఈ మాట 24 ఏండ్ల నుంచి పక్షిలాగా తిరుగుకుంటూ మొత్తం రాష్ట్రానికి చెబుతున్నా. ఇటు కృష్ణా కావొచ్చు. అటు గోదావరి కావొచ్చు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయాయి ఈ నల్లగొండలో. లక్షా 50 వేల మంది మునుగోడు, దేవరకొండతో పాటు ఇతర ప్రాంతాల బిడ్డల నడుము వంగిపోయాయి.
Here's Videos
చివరకు ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఫ్లోరైడ్ బారినపడ్డ బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండవెడితే అయ్యా మా బతుకు ఇది అంటే కూడా పట్టించుకోలేదు. ఆనాడు పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేరా. ఎవరూ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లోరైడ్ రహితంగా తయారు చేశాం. ఇదే విషయాన్ని ప్రజలు కూడా చెబుతున్నారు. భగీరథ నీళ్లు వచ్చాక ఆ బాధలు పోయాయని ప్రజలు చెబుతున్నారని కేసీఆర్ తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, వీడియో ఇదిగో...
మీ అందరి ఆశీస్సులతో ఉద్యమాన్ని విజయంవంతం చేశాం. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీ అందరి దీవేనతో పది ఏండ్లు ఈ గడ్డను పారిపాలన చేశాను. నేనేం తక్కువ చేయలేదు. ఎక్కడో పోయిన కరెంట్‌ను తెచ్చి నిమిషం పాటు కరెంట్ పోకుండా సప్లయి చేయించినం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్లు ఇచ్చాం. ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో, బత్తాయి తోటలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వరిధాన్యం పండించే పరిస్థితులు తెచ్చుకున్నాం. అంతకుముందు లేని నీళ్లు యెడికెళ్లి వచ్చినయ్ అంటే దమ్ము కావాలి.. చేసే ఆరాటం ఉండాలి. ఇది నా ప్రాంతం నా గడ్డ, నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లైనా సాధించి రావొచ్చు అని కేసీఆర్ పేర్కొన్నారు.
Here's BRS Meeting Live
పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.ఆ నాడు రాష్ట్రం కోసం కొట్లాడినం. ఆ నాడు జలసాధన ఉద్యమంలో మండలానికో బ్రిగేడియర్ వచ్చి నెలపదిహేను రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేశాం. ఆ రోజు నేనే రాసిన పాట. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపోయె’ అని. ఆ రోజు ఏడ్చినం. ఈ రోజు గోదావరి, కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నాం. బోనగిరి దగ్గర బస్వాపూర్ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యింది. డిండి ప్రాజెక్టు పూర్తి కాబోతున్నది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోర్లు తెరుచుకొని చూస్తున్నరు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. పైన పాలమూరు ఎత్తిపోతల అయితే పాలమూరుతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్నరు ఎప్పుడు నీళ్లు వస్తయని’ అన్నారు.
ఎవరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు వందలకొద్ది కేసులు వేసినా పదేళ్లు పంటిబిగువున కొట్లాడుతూ.. కేంద్రం పోరాటం చేస్తూ ముందుకు తీసుకుపోయాం. ఆనాడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ఇచ్చిన గవర్నమెంట్ ఆ రోజు ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి.. ఆ తర్వాత ఎవరి వాటా వారికి వస్తుందని చెప్పింది. ఆ నాడు బిల్లు పాస్ కావాలి.. తెలంగాణ రావాలి.. ఇదో ఆటంకం కాకూడదని.. సరే కానివ్వండి తర్వాత చూసుకుందామని చెప్పాం. ఆ తర్వాత ఢిల్లీలో మోదీ ప్రభుత్వం వచ్చింది. వాళ్లకు వందల ఉత్తరాలు రాసినం. అయ్యా మునిగిందే మేం నీళ్లల్లో.. నాశనం అయ్యాం.. మా బతుకులు ఆగమైపోయినయ్.. వెంటనే నీళ్ల పంపిణీ చేయండి.. ట్రిబ్యునల్ వేయాలని అడితే వేయలేదు. వేయకపోతే సుప్రీంకోర్టుకుపోయాం. సుప్రీంకోర్టుకుపోయి తగాదా పెట్టాం. ఆ తర్వాత కూడా వేయలేదు. ఒక రోజు మీటింగ్ జరిగితే.. గట్టిగా నిలదీస్తే కేసు వాపస్ తీసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని చెప్పారు. సరేనని కేసు విత్‌డ్రా చేసుకున్నాం. ఆ తదనంతరం ట్రిబ్యునల్ త్వరగా వేయలేదు. వంద ఉత్తరాలు నేను రాసిన’ అంటూ గుర్తు చేశారు.
‘లోక్‌సభను స్తంభింపజేసినం. ఎంపీలకు మీరు ఏమైనా మంచిదే కొట్లాడాలని చెబితే.. వారం రోజులు లోక్‌సభ జరుగనివ్వలేదు. అట్ల కొట్లాడినం. ఆ ఒత్తిడికి తలొగ్గి.. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్‌కు వేశారు. ఇప్పుడు జరగాల్సిందే ఏంటీ ? ఏ గవర్నమెంట్ ఉన్నా.. మా గవర్నమెంటే ఉండి ఉన్నా ఏం చేయాలి..? ట్రిబ్యునల్ ముందు గట్టిగా వాదించి.. చరిత్ర మొత్తం చెప్పి.. మన అవసరాలు, కరువు చెప్పి, బాధలు చెప్పి.. మన వాటా ఇంత రావాలని కొట్లాడాలే. అది మొగోడు చేయాల్సిన పని. ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డరో.. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నరు. ఆ తర్వాత ఏం నడుస్తుందో మూడో నెల మీరే కళ్లారా చూస్తున్నరు. చిన్న చిన్న విషయాలు ఫర్వాలేదు. మన జీవితాలను దెబ్బకొట్టేటటువంటి కృష్ణా జలాలు కేఆర్‌ఎంబీ భద్రప్పల్లాగా పోయి గర్నమెంట్ అప్పగించింది’ అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు.
రైతులను చెప్పుతో కొడుతావా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనివ్వరా..? ఎన్ని గుండెల్రా మీకు అని కేసీఆర్ ధ్వజమెత్తారు.ఈ రాష్ట్రానికి మేం చేసిన కాడికి చేశాం. ఫలితం చూశాం. ఒకనాడు ఏడ్సిన తెలంగాణ.. నేడు మూడు కోట్ల టన్నుల వడ్లు పండించింది. రైతుబంధు ఇవ్వడానికి కూడా చేతనైత లేదు. ఇంత దద్దమ్మలా..? రైతుబందు కూడా ఇవ్వరా..? అన్నదాతలను పట్టుకుని రైతుబంధు అడిగినోన్ని చెప్పుతో కొట్టమంటావా..? ఎన్ని గుండెల్రా మీకు..? ఎట్ల మాట్లాడుతారు.. కండకావరమా..? కండ్లు నెత్తికి వచ్చినాయా..? ప్రజలను అలా అనొచ్చా..? ఒక్క మాట చెబుతున్నా జాగ్రత్త.. నోటి దరుసుతో మాట్లాడేటోళ్లరా… చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్ల ఉంటయి.. బందోబస్తుగా ఉంటాయి.. గట్టిగా ఉంటయి.. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్లు ఊసిపోతాయి. దానికోసమేనా మీరు అడిగేది. ఇది మర్యాదనా.. గౌరవమా..? ప్రజలను గౌరవించే పద్ధతా..? చేతకాకపోతే జర తర్వాత ఇస్తా.. లేదంటే మాకు చేయొస్తే లేదు అని చెప్పాలి. కానీ అడిగినోని చెప్పుతో కొట్టాలి అని అంటారా..? అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
కేసీఆర్ చలో నల్లగొండ అంటే కేసీఆర్‌ను తిరగనివ్వం అని అంటరు. ఇంత మొగోళ్లా..? కేసీఆర్‌ను తిరగనివ్వరంట.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనివ్వరా..? ఏం చేస్తరు చంపేస్తరా..? దా.? చంపుతావా ఏపాటి చంపుతావో దా..? కేసీఆర్‌ను చంపి మీరు ఉంటారా.. ఇది పద్దతా.. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల తరపున వస్తది. ప్రజల మధ్య అడుగుతది. మీకు దమ్ముంటే మేం చేసిన దానికంటే మంచిగా చేసి చూపియ్. కరెంట్ మంచిగా ఇచ్చి చూపియ్.. ఆగమాగం కావొద్దు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి. దాని గురించి మాటలేదు. ఖమ్మంలో సీతారామ పూర్తి చేయాలి. దాని గురించి ముచ్చట లేదు. గురుకులాలు ఎక్కువ పెట్టాలి.. ఆ ముచ్చట లేదు. కరెంట్ మంచిగా ఇవ్వాలి.. ఆ ముచ్చట లేదు. ఇవన్నీ మాయం చేసి బలాదూర్‌గా తిరుగుదాం అనుకుంటున్నారా..? తిరగనివ్వం జాగ్రత్త అని చెబుతున్నాం. తప్పక నిలదీస్తాం. ఎండగడుతాం అని కేసీఆర్ హెచ్చరించారు.
తెలంగాణకు అన్యాయం జరిగితే తన చివరి వరకు, తన కట్టె కాలే వరకు పులిలాలేచి కొట్టాడుతానని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడితే మీరూ విన్నరు. ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండేనట ఆయనకు. ఉమ్మడి రాష్ట్రమే మంచిగుండే.. ఇప్పుడు మంచిగలేదట. శ్రీకాంత చారి ఎందుకు చనిపోయిండు. ఇదే జిల్లాలో ఉన్న బిడ్డ. ఉద్యమకారులు ఎందుకు చనిపోయారు ? అంతపెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది ? లక్షలు, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నరు ? ఇంత సోయితప్పి మంత్రులు మాట్లాడుతున్నరు’ అంటూ విమర్శించారు.
కేసీఆర్‌ను తిడితే మీరు పెద్దొళ్లు అవుతరా? కేసీఆర్ మీద బదనాం పెడితే పెద్దోళ్లు అవుతరా? ప్రజల హక్కులు గాలికొదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నరో.. దుర్భాషలాడుతున్నరో.. దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నరో టీవీల సాక్షిగా చూస్తున్నరు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. కానీ, తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం. మన వాటా శాశ్వతం. మన బతుకులు నిజం. మన పిల్లల భవిష్యత్ నిజం. దాని కోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడి రాష్ట్రం తెచ్చినం కాబట్టి.. బీఆర్‌ఎస్ సైనికులు కూడా అప్రమత్తంగా ఉండాలి.. మన పోరాటం కొనసాగుతూ ఉండాలి. ఆ విధంగా ముందుకెళ్లాలి’ అంటూ కేసీఆర్ బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆటబొమ్మ కాదు.. అవగాహన చేసుకొని మాట్లాడాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.చలో నల్లగొండ సభ నుంచి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనది ప్రాణహిత. ఇవాళ కూడా 5 వేల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. అవి ఎత్తిపోయాలి. ఎల్ఎండీ, ఎంఎండీ నింపాలి. రైతులకు నీళ్లు ఇవ్వాలి. కానీ ఏం జేస్తుండ్రు.. మేడిగడ్డ పోతాం. బూరుగుగడ్డ పోతాం. బొందలగడ్డ పోతాం.. ఏం తొకమట్ట ఉన్నాది మేడిగడ్డ వద్ద.. బిడ్డ ఈ స్టేజీ మీద ఉన్న నాయకులంతా అసెంబ్లీ అయిపోయాక మేం కూడా అక్కడికి పోతాం.
మీ బండారం బయటపెడుతాం. మీ చరిత్ర మొత్తం ఎండగడుతాం. ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి.. బట్టకాల్చి మీద వేయాలని చెప్పి మేం మేడిగడ్డ పోతాం అంటరు. మేడిగడ్డకు పోయి ఏం పీకుతరు.. ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు. దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయి.. నీళ్లు ఉన్నాయి.. కాపర్ డ్యాం పెట్టి కూడా నీళ్లు ఎత్తిపోయొచ్చు. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే దుష్టబుద్ధి పెట్టుకుని రైతుల పొలాలు ఎండబెడుతారా.. మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తికి నీళ్లు వస్తలేవు. తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం.. చిల్లర రాజకీయం అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
మేడిగడ్డ వద్ద 250 నుంచి 300 పిల్లర్లు ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆట బొమ్మ కాదు. గోదావరి మీద మూడు బ్యారేజీలు ఉంటాయి. 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి. 1500 కి.మీ. కాల్వ ఉంటది. 19 సబ్‌స్టేషన్లు, 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు కాదట. ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయాయి. ఎన్నిసార్లు కుంగిపోలేదు. సాగర్‌లో కుంగిపోలేదా..? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోలేదా..? మొన్నటి దాకా మూసీ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోలేదా..? ఏదన్నపోతే సర్దాలి.. మంచిగా చేయాలి. తొందర రైతులకు నీళ్లు ఇవ్వాలి. మేం మేడిగడ్డం పోతాం.. బొందలగడ్డ పోతాం ఇది రాజకీయమా.. ఇది తెలివా..? ఇది కాదు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అని కేసీఆర్ సూచించారు.
రాజకీయాల్లో ఒకరు ఓడొచ్చు.. ఒకరు గెలవొచ్చు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మళ్లా మేం డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లనే మాట్లాడాలా..? ఈ పద్ధతిని అనుసరించాలా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.నదుల నీళ్ల మీద నీకు అవగాహన లేదు. నన్ను అడిగితే నేను చెప్తుంటి. అడిగే సంస్కారం, తెలివి ఉండొద్దా..? అన్న గిట్ల అంటున్నరు.. కేఆఆర్ఎంబీకి అప్పజెప్పమంటున్నారు.. మమ్మల్ని ఎవరిని అడిగినా చెప్పేటోళ్లం కదా.. అప్పజెప్పడం, ఆగమావడం.. బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు ఇదేనా మీ తెలివి అని కేసీఆర్ నిలదీశారు.
తెలివిలేక.. ప్రభుత్వాన్ని నడిపే చేతగాక మందిమీద బద్నాంపెట్టి బతుకుదామనుకుంటున్నారా? అట్లగాదు బిడ్డా జాగ్రత్తా..! బతుకనివ్వం.. వెంటపడుతం.. వేటాడుతాం అంటూ అధికార కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరావు హెచ్చరించారు. ‘రాష్ట్రం వచ్చాక కరెంటు తెచ్చాం. ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగు చేసి ఏడాదిన్నర నుంచి 24గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చాం. మీరంతా సంతోషంగా నడింట్లో పండుకొని పంటలు పండించారు. పాములు, తేళ్లు కరువంగా బాయిలకాడికి పోలే. కేసీఆర్ గవర్నమెంట్ పోంగనే కట్కేసినట్టే బంద్ అవుతుందా కరెంటు? నేను తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటు దానికి ఏం రోగం అయ్యింది.. మాయ రోగం వచ్చిందా? యాడపోయే కరెంటు’ అంటూ మండిపడ్డారు.
‘ప్రజలను కరెంటుకు తిప్పలు పెట్టినా.. నీళ్లకు తిప్పలుపెట్టినా.. మంచినీళ్లకు తిప్పలుపెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడుతాం. మీకు గవర్నమెంట్ ఇచ్చారు. మాకు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చారు. మిమ్మల్ని నిలదీసే బాధ్యత ఇచ్చారు తప్పా.. ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తం తప్పా.. వదిలిపెడతాం అనేదాంట్లో ఉండొద్దు. ప్రజలకు అన్యాయం చేయొద్దు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.. ఏ విధంగా బీఆర్‌ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో.. ఆ విధంగా కరెంటును పునరుద్ధరించాలి. ఆవిధంగా రాష్ట్ర రైతాంగానికి కరెంటు ఇవ్వాలి. మొన్న మనోళ్లు మీటింగ్‌లో తిరుగుతుంటే.. ఒక్క మీటింగ్‌లో మాట్లాడుతుంటే ఏడుమాట్లు పోతది కరెంటు. నల్లగొండలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుంటే ఏడుసార్లు కరెంటు పోతది. ఏం మాయరోగమచ్చింది. మీకు తెలివి లేక.. నడపరాక.. చేతగాక ఇవాళ మందిమీద బద్నాం పెట్టి బతుకుదామనుకుంటున్నరా? అట్లగాదు బిడ్డా జాగ్రత్త బతుకనివ్వం. వెంటపడుతం. వేటాడుతం’ అని హెచ్చరించారు.
బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తయ్యింది, దిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80శాతం పూర్తయ్యాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు. ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణా జలాలు కేటాయించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగాం. ఇప్పుడు కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రైబ్యునల్ ముందు పోరాడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా.. పిల్లి మాదిరిగా ఉండనని కేసీఆర్ అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)