Navdeep: డ్రగ్స్‌కేసులో ముగిసిన నవదీప్‌ విచారణ, ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్ ఆధారంగా విచారించిన నార్కొటిక్స్ అధికారులు, అన్ని విషయాలు చెప్పానన్న నవదీప్‌

దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ కేసులో విచారించారించరని తెలిపారు.

Navdeep (Photo-X)

Hyderabad, SEP 23: మదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు నవదీప్‌ (Navadeep) శనివారం నార్కోటిక్‌ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ కేసులో విచారించారించరని తెలిపారు. టీఎస్‌ నాబ్‌ అధికారులు అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారని, టీఎస్‌ నార్కోటిక్‌ (Narcotics) అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉన్నదని పేర్కొన్నారు. అయితే, ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్‌ ఆధారంగా విచారిస్తున్నారని, బీపీఎం అనే క్లబ్‌తో నాకున్న సంబంధాలపై ఆరా తీశారని చెప్పుకొచ్చారు.

Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీగా వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. వీడియోతో 

కొంత సమాచారం తెలుసుకునేందుకు విచారణకు రావాలని నోటీసు ఇచ్చారని.. అయితే, నేనెప్పుడు డ్రగ్స్‌ (Drugs) తీసుకోలేదని నవదీప్‌ తెలిపారు విశాఖకు చెందిన రామచంద్‌ దగ్గర నేను డ్రగ్స్‌ కొనలేదని, గతంలో పబ్‌ నిర్వహించినందుకే నన్ను విచారించారని చెప్పారు. గతంలో సిట్‌, ఈడీ (ED) విచారించిందని, ఇప్పుడు తెలంగాణలో నార్కోటిక్‌ పోలీసులు విచారిస్తున్నారన్నారు.

Sharad Pawar Visits Adani Office: అదానీ ఇంటికి శరద్‌ పవార్‌, ఫ్యాక్టరీని ప్రారంభించిన ఇద్దరు నేతలు, ఆసక్తికరంగా మారిన ఇరువురి భేటీ 

నార్కోటిక్‌ అధికారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, అవసరం ఉంటే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారన్నారు. అయితే, నవదీప్‌ సెల్‌ఫోన్‌ను నార్కోటిక్‌ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, విచారణ సమయంలో కాల్‌లిస్ట్‌ను ముందుంచి విచారణ జరిపినట్లుగా తెలుస్తున్నది. వాట్సాప్‌ చాటింగ్‌ను అధికారులు రిట్రీవ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. డేటా అందించిన తర్వాత మరోసారి నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు వివరించారు.



సంబంధిత వార్తలు

ED Notices To KTR: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్ కు ఈడీ నోటీసులు.. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌