NIMS Doctor Suicide: మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఆత్మహత్య.. హైదరాబాద్ లో ఘటన
పూర్తి వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ ప్రాచీ కర్(46) నిమ్స్ లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
Hyderabad, July 6: మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని హైదరాబాద్ (Hyderabad) లోని నిమ్స్ వైద్యురాలు (NIMS Doctor Suicide) ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ ప్రాచీ కర్(46) నిమ్స్ లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో ఆమె అపస్మాకర స్థితిలో కనిపించారు. పక్కనే అనస్థీషియా మత్తు వాయిల్ పడి ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. అనస్థీషియా అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఆమె చనిపోయారని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు.
మిస్టరీగా మరణం
ప్రాచీ కర్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు అయ్యింది. ప్రాచీ కర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, పలువురిని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.