CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్, స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పిన కుటుంబ సభ్యులు

కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా చిత్రహింసలకు గురి కాగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకున్నారు రాథోడ్ నాందేవ్.

Nirmal Gulf Victim thanks to CM Revanth Reddy(X)

Hyd, Oct 5:సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు నిర్మల్ జిల్లాకు చెందిన గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్. కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా చిత్రహింసలకు గురి కాగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకున్నారు రాథోడ్ నాందేవ్.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.తన వేదనను తెలియజేస్తూ నాందేవ్ పంపిన వీడియోపై స్పందించారు సీఎం రేవంత్.వెంటనే బాధితుడిని తిరిగి స్వదేశం రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాస్ స్టెప్పులతో హుషారెత్తించిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. బతుకమ్మ పాటకు విద్యార్థినులతో నృత్యం (వీడియో)

Here's Tweet:

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తూ కువైట్, సౌదీ అరేబియా రెండు దేశాల్లోని భారతీయ ఎంబసీలతో సంప్రదింపులు జరిపి నాందేవ్‌ను స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నారు.