Nizamabad Fake Baba: భూత వైద్యం పేరుతో తల్లీ, కూతురుపై అత్యాచారం, వలలో మరింత మంది మహిళలు, నిజామాబాద్ నకిలీ బాబా లీలలు, దొంగ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు

భూత వైద్యం పేరుతో మహిళలను మోసం చేస్తూ వారిపై అత్యాచార యత్నానికి పాల్పడుతున్న నకిలీ బాబాకు (Nizamabad Fake Baba) బాధితులు, మహిళలు దేహశుద్ధి చేశారు. వైద్యం పేరుతో అభం శుభం తెలియని 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని మూడు నెలలుగా అత్యాచారానికి (Rapes 15 year old girl) పాల్పతున్న దొంగ బాబాకు బడితపూజ చేశారు. ఈ ఘటన నిజామాబాద్‌ నగరంలో (Nizamabad) మంగళవారం వెలుగుచూసింది. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగుతూ.. మత్తుమం‍దు ఇచ్చి మూడు నెలలుగా బాలికపై ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు.

Nizamabad Fake Baba (Photo-Video Grab)

Nizamabad, Oct 13: భూత వైద్యం పేరుతో మహిళలను మోసం చేస్తూ వారిపై అత్యాచార యత్నానికి పాల్పడుతున్న నకిలీ బాబాకు (Nizamabad Fake Baba) బాధితులు, మహిళలు దేహశుద్ధి చేశారు. వైద్యం పేరుతో అభం శుభం తెలియని 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని మూడు నెలలుగా అత్యాచారానికి (Rapes 15 year old girl) పాల్పతున్న దొంగ బాబాకు బడితపూజ చేశారు. ఈ ఘటన నిజామాబాద్‌ నగరంలో (Nizamabad) మంగళవారం వెలుగుచూసింది. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగుతూ.. మత్తుమం‍దు ఇచ్చి మూడు నెలలుగా బాలికపై ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు.

ఈ క్రమంలోనే బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు దొంగబాబాను చితకబాదారు. అయితే భూతవైద్యం పేరుతో మరికొంతమంది మహిళలపై కూడా గతకొంతకాలంగా లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ప్రేమించలేదని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు, అతను నిప్పటించుకున్నాడు, కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఉన్మాది దారుణ ఘటన

ఈ దారుణ ఘటనలో దొంగబాబా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో తాము కూడా అనేక వేధింపులకు గురయ్యామని బాధితులు వాపోతున్నారు. అక్కడి స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పూసల గల్లీలో ఐదేళ్ళ నుంచి భూత వైద్యం మెడిటేషన్, , క్షుద్ర పూజలు, ఆత్మల ప్రవేశం పేరుతో అనారోగ్య సమస్యలు తీరుస్తానని మహిళలను లొంగదీసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న మెట్‌పల్లికి చెందిన తల్లీ, కూతురు ఇటీవల ఈ దొంగ బాబాను ఆశ్రయించారు. వీరికి మాయమాటలు చెప్పిన ప్రబుద్ధుడు తల్లీకూతుళ్లను లోబరుచుకున్నాడు. వైద్యం పేరుతో గదిలోకి రాగానే మత్తు మందు ఇచ్చి వివస్త్రగా మార్చి ముందు తల్లిపై ఆ తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇలా గత మూడు నెలలుగా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బాధితులు షాకింగ్‌కు గురయ్యారు. దారుణాన్ని తెలుకుని బాధితులు మహిళా సంఘాలను ఆశ్రయించడంతో దొంగ బాబా బాగోతం బయటపడింది.

దీంతో దొంగ బాబా కార్యాలయానికి వచ్చిన మహిళా సంఘాల ప్రతినిధులు కామాంధుడిని చెప్పులు, చీపుర్లతో కిందపడేసి కసితీరా కొట్టారు.ప్రస్తుతం దొంగబాబా పోలీసుల అదుపులో ఉండగా.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజా ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల జీవితాలతో ఆటలాడుతున్న ప్రబుద్ధిడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement