CM KCR on BJP: మునుగోడులో ముమ్మాటికీ గెలుపు మాదే! బీజేపీ మూడోస్థానానికే పరిమితమవుతుందన్న సీఎం కేసీఆర్, ఈ సారి సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని సంచలన ప్రకటన, సర్వేల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోతోందన్న సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో పార్టీ లెజ‌స్లేచ‌ర్ పార్టీ (టీఆర్ఎస్ఎల్పీ) స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్న ఈ స‌మావేశంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కేసీఆర్. ఈ ద‌ఫా కూడా సిట్టింగ్‌ల‌కే సీట్లు ఇస్తామ‌న్న కేసీఆర్‌.. ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌కవ‌ర్గాల్లో క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని సూచించారు.

CM KCR Press Meet | File Photo

Hyderabad, SEP 03 : టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక (CM KCR) వ్యాఖ్యలు చేవారు. మునుగోడు ఉపఎన్నికలో (Munugodu by election) గెలుపు మనదే అని కేసీఆర్ (KCR) ధీమా వ్యక్తం చేశారు. అన్నీ సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లోనూ విజయం మనదే అని సమావేశంలో పార్టీ శ్రేణులతో చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ కు రెండో స్థానంలో, బీజేపీ (BJP) మూడో స్థానంలో ఉంటాయన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రెండు గ్రామాలకో ఎమ్మెల్యేను ఇంచార్జిగా నియమిస్తామన్నారు కేసీఆర్. దళితబంధు కోసం నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేయాలని, అలాగే పార్టీ పటిష్టతపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని కూడా కేసీఆర్ సూచించారు. ఇక నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో సహపంక్తి భోజనాలు చేయాలని, వారితో మమేకం అవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు కేసీఆర్.

బీజేపీ మత చిచ్చు పెట్టే కుట్రలు చేస్తోందని, దర్యాఫ్తు సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తోందన్న కేసీఆర్.. దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల జరిగిన రైతు సదస్సులకు స్పందన బాగుందని, అలాగే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అన్నారు. ఇక డిసెంబర్ నాటికి నియోజకవర్గానికి 3వేల డబుల్ డెబ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తామన్న కేసీఆర్.. తెలంగాణ వజ్రోత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

KTR supports Collector: జితేష్.. మీ గౌరవప్రదమైన ప్రవర్తనకు నా అభినందనలు.. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు బాసటగా నిలిచిన మంత్రి కేటీఆర్ 

శ‌నివారం మ‌ధ్యాహ్నం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేబినెట్ స‌మావేశాన్ని నిర్వ‌హించిన కేసీఆర్‌… ఆ వెంట‌నే టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో పార్టీ లెజ‌స్లేచ‌ర్ పార్టీ (టీఆర్ఎస్ఎల్పీ) స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్న ఈ స‌మావేశంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కేసీఆర్. ఈ ద‌ఫా కూడా సిట్టింగ్‌ల‌కే సీట్లు ఇస్తామ‌న్న కేసీఆర్‌.. ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌కవ‌ర్గాల్లో క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని సూచించారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ఎస్‌కే విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌న్న కేసీఆర్‌… ఎన్నిక‌ల్లో పార్టీకి 72 నుంచి 80 సీట్ల దాకా వ‌స్తాయ‌ని చెప్పారు. స‌ర్వేల‌న్నీ కూడా టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయ‌న్నారు. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక‌ను కూడా టీఆర్ఎస్సే గెలుస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిస్తే.. బీజేపీకి ద‌క్కేది మూడో స్థాన‌మేన‌న్నారు. ఉప ఎన్నిక‌లో బీజేపీ అస‌లు పోటీలోనే లేద‌ని తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now