Rahul Gandhi Hyderabad Visit: ఓయూలో రాహుల్ గాంధీ సభకు నో పర్మిషన్, ఎలాంటి సమావేశాలకూ అనుమతి లేదన్న ఓయూ వీసీ, విద్యార్థి నేతల ఆగ్రహం

రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది.

Rahul Gandhi (Photo Credits: Instagram)

Hyderabad: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ సభకే కాదు.. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది.

ఈనెల 7న ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్ కాలేజీ వద్ద.. రాహుల్‌గాంధీ విద్యార్థులను కలిసేలా టీపీసీసీ ప్లాన్‌ చేసింది. కానీ.. వారికి ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షాకిచ్చింది. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఓయూలో ఆందోళనకు దిగాయి.

రెప్పపాటులో కాటేసిన మృత్యువు, ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి, పిల్లలకు తీవ్ర గాయాలు, చివ్వెంల మండల పరిధిలో విషాద ఘటన

రాహుల్‌ సభకు పర్మిషన్‌ ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ ఫైర్‌ అయ్యింది. ఓయూలో నిరసనల తెలిపింది. దీంతో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు విద్యార్థిసంఘాల నేతలు ప్రయత్నించారు. దీంతో ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.