Online Fraud: బ్లాక్ ఫంగస్ కేసు, ఇంజెక్షన్ పేరుతో రూ. 8 లక్షలు దోచేశారు, సైబరాబాద్ పరిధిలో వెలుగు చూసిన భారీ ఆన్‌లైన్ మోసం, సైబరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
అందినకాడికి (Online Fraud) దోచుకుంటున్నారు. మెడిసన్ ఇస్తామంటూ ఆన్ లైన్ ద్వారా అమౌంట్ పే చేయాలంటూ పలువురిని మభ్యపెడుతూ లక్షలకు లక్షల రూపాయలు (Duped of Over Rs 8 Lakh) దోచుకుంటున్నారు.
Hyderabad, May 29: దేశం కరోనావైరస్, బ్లాక్ ఫంగస్ కేసులతో అల్లాడుతుంటే కొందరు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అందినకాడికి (Online Fraud) దోచుకుంటున్నారు. మెడిసన్ ఇస్తామంటూ ఆన్ లైన్ ద్వారా అమౌంట్ పే చేయాలంటూ పలువురిని మభ్యపెడుతూ లక్షలకు లక్షల రూపాయలు (Duped of Over Rs 8 Lakh) దోచుకుంటున్నారు.
ఇలాంటి ఘటనే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. గచ్చిబౌలిలో నివాసముండే ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ వచ్చింది. మినిష్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. ‘పొసకొనజోల్’ అనే మెడిసిన్ (Hyderabad Man Seeking Injection for Black Fungus) కావాలని వైద్యులు సూచించడంతో.. సమీప బంధువును ఆశ్రయించాడు. ఆయన తనకు తెలిసిన మెడికల్ రెప్రజెంటేటివ్ ని ఫోన్ ద్వారా సంప్రదించాడు. అయితే ఇంజెక్షన్ కోసం ఆతడిని సంప్రదించగా అది ఎమ్సన్ మెడికల్ స్టోర్ లో ఉందని నేను అందిస్తానని తెలిపాడు. మీకు ఇంజెక్షన్ కావాలంటే రూ. 8 లక్షలకు ఆన్ లైన్ ద్వారా ముందు పేమెంట్ చేయాలని తెలిపాడు.
పేమెంట్ అందిన తర్వాత మీకు ఇంజెక్షన్ కొరియర్ చేయడం జరుగుతుందని తెలిపాడు. బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తి వెంటనే ఆన్ లైన్ బ్యాకింగ్ ద్వారా సదరు వ్యక్తికి మొత్తాన్ని పంపాడు. మెడిసన్ పంపాలని కోరాడు. అయితే ఆ తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్చాఫ్ అయింది. మోసపోయానని తెలుసుకున్న అతను వెంటనే సైబరాబాద్ క్రైం పోలీసులకు (Cyberabad police) ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయాన్ని టైమ్స్ ఆప్ ఇండియా రిపోర్ట్ చేసింది.