HYD Online Sex Racket: ఆన్‌లైన్ సెక్స్ రాకెట్, నిర్వాహకుడిపై పీడి యాక్ట్ నమోదు చేసిన రాచకొండ పోలీసులు, కీసర కేంద్రంగా వ్యభిచారం నిర్వహణ
కీసరకు చెందిన వంశీరెడ్డి... ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగం పేరుతో బెంగాల్ యువతులకు మాయమాటలు చెప్పడంతో పాటు...ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షించి అక్రమంగా దండుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వంశీరెడ్డిపై రాచకొండ పోలీసులు (Rachakonda police) పీడీయాక్ట్ నమోదు చేశారు.
Hyderabad, August 25: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్‌లో సెక్స్ రాకెట్ ముఠాపై (Hyderabad Sex Racket) పోలీసులు నిఘా పెట్టారు. కీసరకు చెందిన వంశీరెడ్డి... ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగం పేరుతో బెంగాల్ యువతులకు మాయమాటలు చెప్పడంతో పాటు...ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షించి అక్రమంగా దండుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వంశీరెడ్డిపై రాచకొండ పోలీసులు (Rachakonda police) పీడీయాక్ట్ నమోదు చేశారు.
ఈ ఘటన వివరాల్లోకెళితే.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరకు (Keesara) చెందిన వంశీరెడ్డి ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఉద్యోగం పేరుతో పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఇతనికి వ్యభిచారం నిర్వహించే అంజలి అనే మహిళ కూడా తోడయింది. ఇద్దరూ కలిసి ఆన్‌లైన్లో అమ్మాయిల ఫోటోలను పోస్ట్ చేసి విటులను ఆకర్షించేవారు. నచ్చిన అమ్మాయిను వారి వద్దకు పంపించి రూ.వేలల్లో డబ్బు తీసుకునేవాడు. ఈ వ్యవహారం మొత్తం ఆన్‌లైన్‌లోనే సాగిపోయేది. లైవ్ మీటింగ్, సెక్స్‌లో మునిగిపోయిన ఉద్యోగి, బ్రెజిల్‌లోని రియో డి జనీరో మున్సిపాలిటీ కౌన్సిలర్ల సమావేశంలో ఘటన, వైరల్ అవుతున్న వీడియో
దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు వీరి స్థావరంపై దాడి చేసి అమ్మాయిలను రక్షించారు. వంశీరెడ్డితో పాటు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతుల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వంశీరెడ్డిపై పీడీ యాక్ట్ (pd act) నమోదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారు. దీంతో పోలీసులు అతడిపై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు