కరోనావైరస్ దెబ్బకు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. చాలా సంస్థలు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్’ ఆఫర్ ఇచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే అవకాశాన్ని బట్టి ఆన్‌లైన్ మీటింగులు పెడుతున్నారు. ఇక, విద్యార్థులు కూడా ఆన్‌లైన్ క్లాసుల్లో బిజీ అయిపోయారు. చాలామంది జూమ్, గూగుల్ మీట్ ఇలా కొన్ని యాప్‌లను ఆన్‌లైన్ సమావేశాలకు ఉపయోగిస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు కూడా వీటినే ఫాలో అవుతున్నాయి.
తాజాగా, ఓ సమావేశంలో కౌన్సిలర్ల కరోనా వేళ దాన్ని ఎలా కంట్రోల్ చేద్దాం.. సహాయ చర్యలు ఎలా తీసుకుందామని సీరియస్ గా చర్చిస్తున్నారు. అధికారులంతా జూమ్ యాప్‌లో (Zoom app) సమావేశమై కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమయంలో.. ఓ ఉద్యోగి సెక్స్‌లో మునిగిపోయాడు. వీడియోను ఆఫ్ చేయకుండా తన రూములోని యువతితో సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. వీడియో ఆపకుండానే ఈ పని కానిచ్చాడు. అదంతా వీడియోలో రికార్డ్ కావడంతో వైరల్ అయ్యింది. ఆ దృశ్యాలను లైవ్‌లో చూసి కౌన్సిలర్లు, అధికారులు షాక్ తిన్నారు. ఈ ఘటన బ్రెజిల్ దేశంలోని రియోడి జనీరోలో (Rio de Janeiro Council) చోటుచేసుకుంది. నిద్రలో మనిషి ఫ్యాంటులో దూరిన పాము, ఏకంగా ఏడు గంటల పాటు నరకం చూపించింది, ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపూర్ జిల్లాలో భయంకరమైన సంఘటన
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌లోని రియో డి జనీరో మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు (Rio de Janeiro Council Zoom Video Conference) స్థానిక సమస్యలపై చర్చించేందుకు జూమ్ వీడియో మీటింగ్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో.. కరోనా వైరస్ సమయంలో విద్యార్థులకు ఆహార, వసతి సదుపాయాల గురించి సీరియస్‌గా చర్చిస్తున్నారు. ఇంతలో ఓ ఉద్యోగి సమావేశాన్ని పట్టించుకోకుండా.. బెడ్‌పై ఓ యువతితో సెక్స్ చేయడం మొదలు పెట్టాడు.. ఇదంతా ఆ మీటింగ్‌లో ఉన్న కౌన్సిలర్లు, ఛైర్మన్‌కు లైవ్‌లో కనిపిస్తోంది. మీటింగ్‌ను పట్టించుకోకుండా ఆ ఉద్యోగి తనపని కానిచ్చాడు.. దీంతో షాకైన ఛైర్మన్.. ఆ వ్యక్తి వివరాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఆ వ్యక్తి కౌన్సిలర్ కాదని.. స్టాఫ్ మెంబర్ అని తెలింది.