Karimnagar Viral News: ఇష్టంలేని ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి తల్లిదండ్రుల షాక్.. ఆమె అత్తింటికి వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టిన వైనం.. కరీంనగర్ లో వింత ఘటన

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Wall Across Road (Credits: X)

Hyderabad, June 15: తమకు ఇష్టంలేనప్పటికీ, తనకు నచ్చిన విధంగా ప్రేమ పెళ్లి (Love Marriage) చేసుకున్న కూతురికి ఆ తల్లిదండ్రుల (Parents) బిగ్ షాక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎరడపల్లి గ్రామంలో మమత అనే అమ్మాయి అదే గ్రామానికి చెందిన రత్నాకర్‌ ను ప్రేమించింది. అయితే, వీరి పెళ్లికి మమత తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, మమత వాళ్లను కాదని రత్నాకర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో మమతపై కోపం పెంచుకున్న ఆమె తల్లిదండ్రులు వింత నిర్ణయం తీసుకున్నారు.

రైలులో మంటలు అంటుకున్నాయని పుకార్లు షికార్లు.. భయంతో నడుస్తున్న రైలు నుంచి దూకిన పలువురు ప్రయాణికులు.. ఎదురుగా మరో ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని ముగ్గురు ప్రయాణికుల మృతి.. ఝార్ఖండ్‌ లో ఘోరం

రోడ్డుకు అడ్డంగా గోడ

మమత తన అత్తారిల్లు అంటే రత్నాకర్ ఇంటికి వెళ్లాలంటే.. తన పుట్టిల్లు మీదుగా రోడ్డు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది తెలిసిన మమత తల్లిదండ్రులు.. ఆమె మీద కోపంతో రత్నాకర్ ఇంటికి అడ్డంగా రోడ్డుపై గోడ కట్టారు. దీంతో మమత దంపతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ పంచాయతీ పోలీసు స్టేషన్ కు చేరినట్టు సమాచారం.

ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టబోతుందని వార్తలు.. ఇప్పటికైతే ప్రతిపాదనేదీ లేదన్న బీమా దిగ్గజం



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Bengal Women Creates History: మహిళల దేశవాళీ క్రికెట్‌ లో బెంగాల్ టీమ్ నయా చరిత్ర.. హర్యానాపై ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బెంగాల్

PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉద‌య్‌ పూర్‌ లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు.. రేపు హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్