Pawan Kalyan Health Update: కోలుకుంటున్నా, త్వరలో మీ ముందుకు వస్తా, కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్, తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన జనసేన అధినేత

ప్రస్తుతం తాను వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోలుకుంటున్నానని, వీలైనంత త్వరలో ప్రజల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Janasena Cheif Pawan Kalyan | Photo: JSP Twitter

Hyderabad, April 18: జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే కరోనా బారినపడి తన ఫాంహౌస్ లోనే చికిత్స పొందుతున్న (Pawan Kalyan Health Update) విషయం విదితమే. ప్రస్తుతం తాను వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోలుకుంటున్నానని, వీలైనంత త్వరలో ప్రజల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

తన క్షేమం కోసం అన్ని వర్గాల వారు సందేశాలు పంపారని, అభిమానులు, జనసైనికులు ఆలయాల్లో, ప్రార్థన మందిరాల్లో పూజలు, ప్రార్థనలు చేశారని... అలాంటి వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు అనే పదాలతో తన భావోద్వేగాలను వెల్లడించలేకపోతున్నానని తెలిపారు. అందరూ తన కుటుంబ సభ్యులేనని ఉద్ఘాటించారు.

కాగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Coronavirus Second wave) తీవ్రంగా ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయని, ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. అయితే, కేసుల తీవ్రతను అంచనా వేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని, రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.

ఏపీలో లాక్‌డౌన్‌ లేకుండా కోవిడ్‌ నియంత్రణ, కర్నూల్‌ జిల్లాలో కొత్తగా 11 ప్రైవేటు కరోనా‌ ఆసుపత్రులు, తాజాగా 6,582 మందికి కోవిడ్ పాజిటివ్, 22 మంది మృతితో 7,410కి చేరుకున్న మరణాల సంఖ్య

బెడ్స్ కొరతతో కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడంలేదని, చికిత్సలో ఉపయోగించే మందుల కొరత ఏర్పడిందని వివరించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.