Petition on Hydra: హైడ్రాపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ! హైకోర్టులో పిటీషన్ దాఖలు, హైడ్రా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్‌పూర్‌లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
Hyderabad, SEP 13: చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)పై హైకోర్టులో పిటిషన్ (High Court Petition) దాఖలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన జీవో 99 చట్టబద్దతను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. జీహెచ్ఎంసీ యాక్ట్ కాదని హైడ్రాకు ఎలా అధికారాలు ఇస్తారని అడిగారు. హైడ్రా చట్టబద్దతను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో హైడ్రా (Hydra) తీరుపై హైకోర్టు (Telangana High court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్‌పూర్‌లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూల్చేశారని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చేసినట్లు కోర్టుకు పిటిషనర్ తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.