Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టు రద్దు

ఈ కేసులో కీలక నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది.

Phone Tapping Case (Credits: X)

Hyderabad, Oct 26: తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు (Prabhakarrao), మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. హైదరాబాద్ పోలీసులు పంపిన నివేదిక మేరకు ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే వీరిద్దరిపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న విషయం తెలిసిందే.

మహబూబాబాద్ జిల్లాలో మందుబాబు హల్ చల్.. మద్యం మత్తులో తనని తాను పొడుచుకుంటూ భీభత్సం.. వీడియో వైరల్

ఎక్కడ ఉన్నారు?

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మార్చి 10న కేసు నమోదైన వెంటనే ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ రావు అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో వీరిని విచారించే అవకాశం లేకపోయింది. విచారణకు హాజరుకావాలంటూ ఎన్నిసార్లు నోటీసులు పంపినా వీళ్లు హాజరుకాకపోవడం గమనార్హం.

త‌న‌ అరెస్టు గురించి చెప్తూ ఎమోష‌న‌ల్ అయిన చంద్ర‌బాబు, అన్ స్టాప‌బుల్ షోలో ఆయ‌న పంచుకున్న వివ‌రాలివే