Case Against Harish Rao Relatives: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై పోలీసు కేసు నమోదు.. ఎందుకంటే??
తన ఐదంతస్తుల భవనంలో హరీశ్ రావు బంధువులు తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్ కుమార్ గౌడ్, గారపడి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు అక్రమంగా ఉంటున్నారని బాధితుడు దండు లచ్చిరాజు అనే వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hyderabad, Oct 18: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (BRS MLA Harish Rao) బంధువులపై పోలీసు కేసు (Police Case) నమోదైంది. తన ఐదంతస్తుల భవనంలో హరీశ్ రావు బంధువులు తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్ కుమార్ గౌడ్, గారపడి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు అక్రమంగా ఉంటున్నారని బాధితుడు దండు లచ్చిరాజు అనే వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోస్మో హాస్పిటాలిటీ పేరుతో ప్రామిసరీ నోటు తీసుకుని చీటింగ్ కు పాల్పడ్డారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలియకుండానే వారు తన ఇంటిని అమ్మేశారని ఆరోపించారు.
Here's Video:
ఐదేండ్ల నుంచి పోరుబాట
తన ఆస్తి కోసం 2019 నుంచి పోరాడుతున్నట్లు లచ్చిరాజు వాపోయాడు. లచ్చిరాజు ఫిర్యాదుపై ట్రెస్ పాస్, చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.