Restrictions On Firecrackers: హైదరాబాద్‌ లో బాణాసంచా కాల్చడంపై ఆంక్షలు, ఈ టైంలో మాత్రమే కాల్చాలంటూ ప్రజలకు సూచించిన హైదరాబాద్ పోలీసులు, భారీ శబ్ధం వచ్చే క్రాకర్స్‌ కాల్చేవారికి సూచనలు

ఈ నెల 12 నుంచి 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు సిటీ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు.

Firecrackers (Photo Credits: PTI)

Hyderabad, NOV 10: దీపావళి పండుగ నేపథ్యంలో (Diwali) బాణాసంచా కాల్చడంపై (Restrictions On Firecrackers) హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు సిటీ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు. హైదరాబాద్‌ (Hyderabad), సికింద్రాబాద్‌ పరిధిలో భారీ శబ్దం వచ్చే టపాసులు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని నోటీసులు సూచించారు.  నివాస ప్రాంతాల్లో రాత్రి 8 నుంచి 10 గంటలకు మాత్రమే కాల్చలని ఆదేశించారు. పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం నేపథ్యంలో సాధారణ టపాసులకు బదులుగా గ్రీన్‌ కాకర్స్‌తో (Green Crackers) పండగను జరుపుకోవాలని సూచించారు.

Diwali 2023: దీపావళి సెలవు తేదీ మార్పుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, హాలిడేను ఆదివారం నుంచి సోమవారానికి మార్చుతున్నట్లు ఉత్తర్వులు 

ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ శాండిల్య (Shandilya) హెచ్చరించారు. పర్యావరణ అనుకూలంగా, సురక్షితంగా పండగను జరుపుకోవాలని, మార్గదర్శకాలను అందరూ పాటించి సహకరించాలని కోరారు.



సంబంధిత వార్తలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్