Ponnam Prabhakar Meets KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా వినతి, రాజకీయాలు చర్చించలేదన్న పొన్నం

ఈ నెల 9న సచివాలయంలో జరిగే విగ్రహావిష్కరణకు ప్రోటోకాల్ అధికారులతో కలిసి కేసీఆర్‌‌కు ఆహ్వానం అందించాం అని చెప్పారు

Ponnam Prabhakar invites KCR for Telangana Thalli statue unveiling(X)

Hyd, Dec 7:  తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్‌ను ఆహ్వానించాం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 9న సచివాలయంలో జరిగే విగ్రహావిష్కరణకు ప్రోటోకాల్ అధికారులతో కలిసి కేసీఆర్‌‌కు ఆహ్వానం అందించాం అని చెప్పారు.

ఉదయం గవర్నర్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు కలిసి కార్యక్రమానికి ఆహ్వానించాం అని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. కేసీఆర్‌తో ఎలాంటి రాజకీయ అంశాలపై మాట్లాడలేదు అని వెల్లడించారు.

Here's Video:

కేసీఆర్ ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లి లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు వంశిధర్ రావు తదితరులు..సాదర స్వాగతం పలికారు. తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు లంచ్ ఆతిథ్యమిచ్చి కేసీఆర్ గౌరవించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంధర్భంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులున్నారు.