Hyd, Feb 8: ఇవాళ సాయంత్రం బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమావేశం కానున్నారు. బీసీ కుల గణన పై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రభుత్వ విప్ లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్.. బీసీ సంఘాల నేతలతో చర్చించనున్నారు.
రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య(R Krishnaiah), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 10 మంది బీసీ కీలక నేతలు పాల్గొననున్నారు.
సమగ్ర కుల సర్వేలో పొరపాట్లు జరిగాయి అంటున్నారు బీసీ సంఘం నేతలు. కుల సర్వే లో జరిగిన పొరపాట్లు చెప్పాలంటూ బీసీ సంఘాలను చర్చకు ఆహ్వానించారు మంత్రి పొన్నం.
బీసీ సంఘాలు చెప్పినట్టు సమగ్ర కుల సర్వే లో నిజంగా పొరపాట్లు జరిగాయా అన్న అంశంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. నిన్న బీసీ సంఘాలతో ఫోన్లో మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ మంత్రిగా నేనే మీ దగ్గరికి వచ్చి చర్చిస్తానని బీసీ సంఘాలతో చెప్పారు. ప్రభుత్వపరంగా చర్చలకు ఆహ్వానిస్తే పొరపాట్లు ఎక్కడ జరిగాయో వివరిస్తామని అని బీసీ సంఘాల నేతలు చెప్పిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.