![](https://test1.latestly.com/uploads/images/2025/02/bjp-bandi-sanjay-on-delhi-assembly-election-results.jpg?width=380&height=214)
Delhi, Feb 8: 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అధికారం దిశగా దూసుకెళ్తోంది బీజేపీ. మేజిక్ ఫిగర్ 36ను దాటి 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కాషాయ పార్టీ(Delhi Assembly Elections). బీజేపీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay).ఆప్ పార్టీ(AAP)ని చీపురుతో ఊడ్చేశామని వెల్లడించారు. ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారని తెలిపారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీ వద్దని తీర్పునిచ్చారన్నారు. ఢిల్లీలో కమల వికాసం.. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురి పేర్లు.. పూర్తి వివరాలు ఇవిగో..!
ఇక ల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనని చెప్పారు బండి సంజయ్(BJP Bandi Sanjay). తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలని.. శాసససభలో మీ సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ ఒక్కటే అని బండి సంజయ్ అన్నారు.
ఢిల్లీలో ఆప్ వెనుకంజలో ఉండడంతో ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ చెప్పిన అసత్యాలను ఎవరూ నమ్మలేదని అన్నారు. ప్రజలకు ద్రోహం చేసిన వారిని ప్రజలు ఇలాగే ఓడిస్తారని చెప్పారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.