Revanth Reddy on Prajapalana: ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల గడువు.. దాదాపు 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరణ.. ఇంకా అప్లికేషన్లు సమర్పించని వేలాది మంది.. స్పందించిన సీఎం రేవంత్.. ఆందోళన వద్దు... ఇక నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వొచ్చని స్పష్టం
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
Hyderabad, Jan 7: ‘ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ’ (Prajapalana-Abhayahastham) గడువు నిన్నటితో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అయితే కొన్ని కారణాలతో వేలాదిమంది ఇంకా దరఖాస్తులు (Applications) చేయలేదు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy) స్పందించారు. అర్హులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు.
ఇప్పటి వరకు అధికారులు ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరించారని.. ఇప్పుడు ప్రజలు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వవచ్చునని స్పష్టం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో నిన్న జరిగిన బిగ్ డిబేట్ కార్యక్రమంలో ఈ మేరకు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు.