President Draupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ కోసం టోల్ ఫ్రీ నెంబర్...!

ఇవాళ సాయంత్రం 6 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రపతి చేరుకోనున్నారు. 6.20 నుంచి 7.10 వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం రాత్రి 7.20కి ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు ముర్ము.

President Draupadi Murmu to visit Hyderabad today(X)

Hyd, Nov 21:  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రపతి చేరుకోనున్నారు. 6.20 నుంచి 7.10 వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం రాత్రి 7.20కి ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు ముర్ము.

రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. రేపు ఉదయం 10.20కి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి 120 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్‌ పి.విశ్వప్రసాద్‌ తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి సూచించారు. మాగనూరు స్కూల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశం..ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులపై ఫైర్ 

ఇవాళ సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పంజాగుట్ట జంక్షన్, గ్రీన్‌ ల్యాండ్‌ జంక్షన్, బేగంపేట్‌ ఫ్లైఓవర్, శ్యాంలాల్‌ బిల్డింగ్, పీపీఎన్‌టీ ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్‌ ఔట్‌గేట్, ఎయిర్‌పోర్టు వై.జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కత్రియ హోటల్, మెట్రో రెసిడెన్సీ, పీవీ విగ్రహం, రాజ్‌ భవన్‌ రోడ్, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్, నెక్లెస్‌ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్‌ మార్గ్, కట్టమైసమ్మ, ఇక్బాల్‌ మినార్, ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం జంక్షన్, అశోక్‌నగర్‌ జంక్షన్‌, ఎన్టీఆర్‌ స్టేడియం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు.

ఇక రేపు(22)న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాదాపూర్, రాయదుర్గం, కొత్తగూడ, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ సమాచారం కోసం ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ టోల్ ఫ్రీ నెంబర్ 85004 11111 అందుబాటులో ఉంటుందని చెప్పారు.



సంబంధిత వార్తలు

Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif