Rahul Gandhi: దేశంలో ఇంకా కుల వివక్ష ఉంది, నిజం మాట్లాడితే దేశాన్ని విభజిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు...ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

అదేవిధంగా కుల వివక్షలు ఉన్నాయని కూడా అందరికీ తెలుసు అన్నారు కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తాను ఈ నిజాలు మాట్లాడితే దేశాన్ని విభజిస్తున్నానని పీఎం నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు అని మండిపడ్డారు.

Rahul Gandhi attends caste census meeting in Hyderabad(X)

Hyd, Nov 6:  ఈ దేశంలో కులాలు ఉన్నాయి. అదేవిధంగా కుల వివక్షలు ఉన్నాయని కూడా అందరికీ తెలుసు అన్నారు కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తాను ఈ నిజాలు మాట్లాడితే దేశాన్ని విభజిస్తున్నానని పీఎం నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు అని మండిపడ్డారు.

సామజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుటుంబ సర్వే పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన కుల గణన సంప్రదింపుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాహుల్ గాంధీ.

టైటానిక్ నిర్మించినపుడు దాని రూపకర్త అది మునిగిపోదని చెప్పాడు. కానీ అది కేవలం ఒక వారం తర్వాత మునిగిపోయిందన్నారు. మంచు కొండలను గుర్తించే బాధ్యత కలిగిన వ్యక్తి దానిని చూడలేకపోయాడు. మంచు కొండను ఢీకొన్న తర్వాత టైటానిక్‌ మునిగిపోయింది. మంచు కొండను ఎవరూ గుర్తించకపోవడనికి కారణం 90% మంచు కొండ సముద్రపు నీటిలో ఉంది. అందువల్ల పైన కనిపించే కొంత భాగాన్ని మంత్రమే చూడగలిగారు. వాస్తవానికి సముద్రం క్రింద దాగి ఉన్న భారీ మంచు కొండ అని వ్యక్తి గ్రహించలేదు అని ఉదాహరించారు. భారతదేశంలోని కుల వివక్ష ఈ మంచు కొండను పోలి ఉంటుంది, దానిలో ఎక్కువ భాగం దాగి ఉంటుంది. ఇది వివిధ కారణాల చేత కనపడకుండా ఉందని తెలిపారు. హెల్మెట్ ధరించకుండా రోడ్డు మీదకు బైకుతో వెళితే జేబులు గుల్లే, నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Here's Video:

కుల గణనకు సకల జనులకు ఆదరణ తెలపాలన్నారు రాహుల్ గాంధీ. ఈ సదస్సులో ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొని వారి అభిప్రయాలను వ్యక్తం చేశారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



సంబంధిత వార్తలు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif