Rahul Gandhi At Khammam: బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే! అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4వేలు పెన్షన్, ఖమ్మం సభలో రాహుల్ గాంధీ
విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశామని చెప్పారు. ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్ (Congress) పార్టీ ఖిల్లా అని రాహుల్ చెప్పారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ (BJP) ఒకటేనని అన్నారు
Khammam, July 02: దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్థించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశామని చెప్పారు. ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్ (Congress) పార్టీ ఖిల్లా అని రాహుల్ చెప్పారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ (BJP) ఒకటేనని అన్నారు. తెలంగాణలో వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పింఛను ప్రకటిస్తున్నానని తెలిపారు. అందుకు చేయూత పథకాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అలాగే, తాము అధికారంలోకి వచ్చాక ఆదివాసీలకు పోడు భూములు పంపిణీ చేస్తామని అన్నారు. ఇప్పటికే తమ పార్టీ కర్ణాటకలో బీజేపీ (BJP) సర్కారును ఓడించిందని తెలిపారు. తమ పార్టీ ప్రేమను పంచుతోందని, మిగతావారు ద్వేషాన్ని పంచుతున్నారని తెలిపారు. అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికీ తీసిపోలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ (BRS) బీ టీమ్ అని చెప్పారు.
పొంగులేటికి (Ponguleti) స్వాగతం పలుకుతున్నానని, బీఆర్ఎస్ కు స్వస్తి చెప్పి ఆయన కాంగ్రెస్ లో చేరారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. తెలంగాణలో బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ ను ఓడిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఓ స్వప్నంగా ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల కలలను ధ్వంసం చేసిందని తెలిపారు.
ధరణి భూముల సమస్యను జోడో యాత్రలో తెలుసుకున్నానని తెలిపారు. రైతుల బిల్లు విషయంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని అన్నారు. బీజేపీ ఏం చేసినా అందుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు.