Rain Alert for Hyderabad: రెండు రోజులు రోడ్ల పైకి ఎవరూ రావద్దు, నగర వాసులకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్, మరో రెండు రోజుల పాటు ఏపీ తెలంగాణాలో భారీ వర్షాలు, ప్రమాదం జరిగితే వెంటనే డయల్ 100కు కాల్ చేయండి

కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాహనదారులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Rain alert hyderabad-police-warning-citizens ( Photo-Twitter)

Hyderabad,Septemebr 29:  తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాహనదారులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజుల పాటు నగరానికి భారీ వర్ష సూచనలు ఉన్నాయని,ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లే వారు అలర్ట్ గా ఉండాలని సీపీ అంజనీకుమార్ చెప్పారు. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని సీపీ వెల్లడించారు. వర్షం కారణంగా ఇబ్బంది తలెత్తితే డయల్ 100కు కాల్ చేయాలని, 24 గంటలూ పోలీసులు సాయం చేస్తారని హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ ట్వీట్ 

కాగా కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు ధాటికి లోతట్టు ప్రాంతాలు ఇప్పటికి జలదిగ్బందనంలోనే ఉన్నాయి. డ్రైనేజ్‌ లీకై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులు అటాక్ అవుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతోంది. ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆవర్తనం ఎఫెక్ట్ తో ఏపీ, తెలంగాణలో రెండు రోజులు(సెప్టెంబర్ 29,30) వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరుగా, కొన్ని చోట్ల భారీగా వానలు పడే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో కుండపోత వర్షం పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వాహనదారులను అప్రమత్తం చేశారు.

దేశంలో ఈ ఏడాది ఇప్పటికే సాధారణం కన్నా ఏడు శాతం ఎక్కువగా వర్షం కురిసింది. సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు కొనసాగే ఉన్నందున సాధారణం కన్నా అధిక వర్షపాతం రికార్డు కావచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాగులు వంకలు, నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వరద ఉధ‌‌ృతికి మరోసారి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేశారు. మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.  జలదిగ్బంధనంలో బిహార్‌, భారీ వర్షాలతో అతలాకుతలం

మరోవైపు ఏపీ తెలంగాణతో పాటు భారీ వర్షాలు ఉత్తరాదిని సైతం వణికిస్తున్నారు.బీహార్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు బీహార్, యూపీ అతలాకుతలం అయ్యాయి. ఇటు ఎన్టీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి.