MLA Raja Singh Joining TDP: టీడీపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన రాజా సింగ్, ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది చంద్రబాబే..రాజాసింగ్ జోస్యం..

తాను తెలుగుదేశం పార్టీ లో చేరడం లేదని, బీజేపీలోనే కొనసాగాలన్నదే తన అభిమతమని చెప్పారు.

BJP MLA Raja Singh (Photo Credits: Facebook/ Raja Singh)

తాను టీడీపీలో చేరనున్నట్టు వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీ లో చేరడం లేదని, బీజేపీలోనే కొనసాగాలన్నదే తన అభిమతమని చెప్పారు. బీజేపీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేసేందుకు చివరి క్షణం వరకు వేచి చూస్తామన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటూ హిందూ ధర్మం కోసం పాటుపడతానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వల్ల జరగని తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబే కారణమని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ గెలిచే అవకాశాలున్నాయన్నారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని, చంద్రబాబు తనకు రాజకీయంగా ప్రాణం పోసారని, గౌరవం ఉండడం వేరు. రాజకీయం వేరు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. నా మనస్తత్వానికి బీజేపీ మాత్రమే సరిపోతుందని రాజా సింగ్ అన్నారు.

Karnataka Elections 2023: సోనియాగాంధీ విషకన్య! కర్ణాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు, కాంగ్రెస్-బీజేపీ మధ్య కొనసాగుతున్న "విష"పూరిత కామెంట్స్‌

రాజా సింగ్ 2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలుపొందడం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత బీజేపీలో చేరి 2014లో గోషామహల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. రాజా సింగ్ 2018లో కూడా ఇదే స్థానం నుంచి గెలుపొందారు.

అయితే రాజా సింగ్ ఒక వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల కారణంగా జైలుకు వెళ్లినప్పుడు, బిజెపి నాయకత్వం అతన్ని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌ ఎత్తివేతపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా రాజాసింగ్ తాను టీడీపీలో చేరడం లేదని చెప్పడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.