Sun Halo in HYD: హైదరాబాద్‌లో సన్‌ హాలో, సూర్యుడి చుట్టూ అందంగా పరుచుకున్న ఇంద్రధనస్సు, సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్న హలోస్‌ ఫోటోలు

మంగళవారం రాత్రంతా ఉరుములు మెరుపులు, భారీ వర్షంతో తడిసి ముద్దైన నగరంలో ఈ రోజు సూర్యుడి చుట్టూ రెయిన్ బో (ఇంద్రధనస్సు) అందంగా పరుచుకుంది.

Sun Halo (Photo-Twitter)

Hyderabad, June 2: హైదరాబాద్‌ నగరంలో అందమైన దృశ్యం విపరీతంగా ఆకర్షిస్తోంది. మంగళవారం రాత్రంతా ఉరుములు మెరుపులు, భారీ వర్షంతో తడిసి ముద్దైన నగరంలో ఈ రోజు సూర్యుడి చుట్టూ రెయిన్ బో (ఇంద్రధనస్సు) అందంగా పరుచుకుంది. దీంతో పలువురు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. సన్‌ హాలో (Sun Halo in HYD) అంటూ ఫోటోలను షేర్‌ చేస్తున్నారు. ట్విట్టర్లో సన్‌హాలో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది.

కాగా మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడి చుట్టూ గుండ్రంగా రెయిన్ బో (RainBow) చాలా స్పష్టంగా కనిపించింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగానే ఇంధ్రధనుసు దర్శనమిచ్చిందంటూ నగర వాసులు మురిసిసోతున్నారు. వర్షం కారణంగా, వాతావరణంలో నీటి బిందువులు ఉంటాయనీ, అవి క్రిస్టల్స్‌గా మారతాయని, క్రిస్టల్స్‌గా మారిన నీటి బిందువులలో సూర్యుడి కాంతి ప్రసంరించినప్పుడు ఇలా రెయిన్ బో ఏర్పడుతుందని నెటిజన్లు కమెంట్‌ చేస్తున్నారు.

దట్టమైన మేఘాలు ఏర్పడి వాటిలో ఘనీభవించిన నీటి బింధువులపై సూర్య కిరణాలు పడినప్పుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కతమవుతుందని తెలిపారు. మంచు బింధువులపై పడిన కిరణాలు పరావర్తనం చెంది ఇలా ఇంధ్ర ధనస్సు రంగుల్లో కనిపిస్తాయని చెప్పారు. సాధారణ పరిభాషలో దీన్ని వరద గూడు అని అంటారని, ఇలా ఏర్పడితే ఆ సంవత్సరమంతా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రైతుల నమ్ముతారు.