KTR Slams CM Revanth Reddy: రైతు బంధు డబ్బులే రుణమాఫీకా?..సీఎం రేవంత్‌ రెడ్డిది దగా అని మండిపడ్డ కేటీఆర్

మొదటి దశలో సాయంత్రం 4 గంటలకు రూ. లక్ష వరకు రుణమాఫీ జరగనుంది.

KTR slams CM Revanth( KTR Twitter)

Hyd, July 18:  11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను జమ చేయనున్నారు. రుణమాఫీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిలో పాల్గొననున్నారు. ఇక గ్రామ,గ్రామాన సంబరాలు చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.

ఇక కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న రుణమాఫీపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తోందని ఆరోపించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7 వేల కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారన్నారని.... హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తరు? అని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా? అని ప్రశ్నించారు. 2014 లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ. 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందని గుర్తు చేశారు కేటీఆర్.   నడిరోడ్డుపై ఇంత దారుణంగా నరికి చంపుతారా, వినుకొండ ఘటనపై స్పందించిన వైఎస్ జగన్, ఈ దాడులు ప్రభుత్వానికి సిగ్గుచేటని వెల్లడి

2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు, కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

Here's Tweet:

 



సంబంధిత వార్తలు

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన