Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో దంచికొట్టిన వాన, ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం
గత రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతుండటంతో.. ఉక్కపోతతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం చల్లని వాతావరణం ఏర్పడింది. ఇక వర్షం కురియడంతో నగర వాసులకు (Heavy rain) ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది.
Hyderabad, July 12: హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం (Rain) కురిసింది. గత రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతుండటంతో.. ఉక్కపోతతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం చల్లని వాతావరణం ఏర్పడింది. ఇక వర్షం కురియడంతో నగర వాసులకు (Heavy rain) ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్, సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి, సూరారంతో పాటు సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, బేగంపేట్, సనత్‌నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, బంజారాహిల్స్, ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసింది. రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మెరిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు.