Warangal Accident: వరంగల్‌ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం, ఐదుగురు స్పాట్‌లోనే మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం, బాధితులంతా తేనె అమ్ముకునే వ్యక్తులే!

జిల్లాలోని వర్ధన్నపేట మండలం (Wardhannapet) ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ (Lorry Hits Auto) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.

Road Accident (Representational Image)

Warangal, AUG 16: వరంగల్ జిల్లాలో (Warangal) విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వర్ధన్నపేట మండలం (Wardhannapet) ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ (Lorry Hits Auto) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు మరణించగా.. మరో ముగ్గురు ప్రయాణీకులు ఆటోలో ఇరుక్కుపోయారు. వీరిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

AP Road Accident: బాపట్లలో స్కూలు బస్సు బోల్తా, 9 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు 

అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా సంచారజాతులకు చెందినవారిగా ప్రాథమికంగా గుర్తించారు. చెట్లపై తేనెను సేకరించి అమ్ముకునే కుటుంబాలని పోలీసులు తెలిపారు.