SangaReddy Fire: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సీఎం ఆదేశాలు

వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డి ని ఆదేశించారు

cm revanth reddy

Hyd, April 3: సంగారెడ్డి జిల్లా హత్నుర మండలంలోని కెమికల్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డి ని ఆదేశించారు. ఈ ప్రమాదంలో (SangaReddy Fire) గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందచేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఘటనాస్థలంలో పరిస్థితిని మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖలు పర్యవేక్షిస్తున్నారు. కంపెనీలో రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కొండా సురేఖ అన్నారు. మంటలు ఆరిపోయిన తర్వాత మృతులను గుర్తిస్తామని కలెక్టర్ చెప్పారని తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.  సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, డైరెక్టర్‌‌తో పాటుగా ఆరుగురు కార్మికులు మృతి, వీడియోలు ఇవిగో..

ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. అందరికీ మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

ఈ రోజు సాయంత్రం ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితో పాటు 7గురు మృతి చెందగా, 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ప్లాంట్‌లో 50 మంది కార్మికులు ఉన్నారు. ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులను బయటకు తీసుకురావడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారిని అక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.