MLA Sayanna Passes Away: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నిరాడంబరుడిగా పేరు, సంతాపం తెలిపిన అన్ని పార్టీల నేతలు

గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సాయన్నను యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

MLA Sayanna Passes Away (PIC @ Sayanna Twitter)

Hyderabad, FEB 19: సికింద్రాబాద్‌ కంట్మోనెంట్‌ భారత్‌ రాష్ట్ర సమితి శాసనసభ సభ్యుడు సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు (Sayanna passes away). గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సాయన్నను యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. 1951 మార్చి 5న సాయన్న చిక్కడపల్లిలో జన్మించారు. ఇప్పటి వరకు ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సాయన్న టీడీపీ తరఫున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2009లో కాంగ్రెస్‌ (Congress) ఎమ్మెల్యే శంకరరావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 2014 తర్వాత సాయన్న బీఆర్‌ఎస్‌ (BRS)లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరఫునే కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Taraka Ratna No More: హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్దీవదేహం.. ప్రముఖుల సంతాపం.. భౌతిక కాయాన్ని చూడటానికి క్యూకట్టిన అభిమానులు, రేపు అంత్యక్రియలు.. వీడియోతో 

ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంపై మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. వారిఉ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth reddy) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘సాయన్న ఎంతో సౌమ్యుడు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో నగర ప్రజలకు ఎనలేని సేవలందించిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు.



సంబంధిత వార్తలు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana Assembly Session 2024: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుంది, అమెరికాలో చెప్పుకుంటున్నారంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

KTR Meets Nandini Sidda Reddy: రేవంత్ రెడ్డి ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించిన నందిని సిధారెడ్డి, ఇంటికి వెళ్లి మ‌రీ అభినందించిన కేటీఆర్