Telangana: ఆ ఎస్‌ఐ అర్థరాత్రి అడవిలో నాపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు, మహబూబాబాద్‌ జిల్లాలో కలకలం రేపుతున్న మహిళా ట్రైనీ ఎస్‌ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఘటనపై విచారణకు ఆదేశించిన వరంగల్ సీపీ తరుణ్‌జోషి

జిల్లాలోని మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తనపై అత్యాచారయత్నానికి (Sexual Harassment) పాల్పడ్డారంటూ మహిళా శిక్షణ ఎస్‌ఐ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు(Warangal CP) ఫిర్యాదు చేశారు

Sexually Assault | Representational Image (Photo Credits: File Image)

Mahabubabad, August 3: తెలంగాణలో మహబూబాబాద్‌ జిల్లాలో ఓ మహిళా ట్రైనీ ఎస్‌ఐపై లైంగిక వేధింపులు (Sexual Harassment On Trainee SI) కలకలం రేపాయి. జిల్లాలోని మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తనపై అత్యాచారయత్నానికి (Sexual Harassment) పాల్పడ్డారంటూ మహిళా శిక్షణ ఎస్‌ఐ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు(Warangal CP) ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు సీపీని కోరారు. గత రాత్రి ఎస్‌ఐ అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారంటూ ట్రైనీ ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు.

ట్రైనీ ఎస్ఐపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని.. మహబూబాబాద్‌ ఎస్పీని వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఆదేశించారు. దళిత యువతి కావడమే తన బిడ్డ చేసిన పాపమా? అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తనకు న్యాయం జరగకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని బాధిత మహిళ చెప్పింది. దీంతో వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.