Pushpa 2 Premiere: నాకు లివర్ దానం చేసింది...ఇప్పుడు తనే లేకుండా పోయింది, రేవతి మృతిపై భర్త భాస్కర్ ఆవేదన, నా కష్టం ఎవరికి రావొద్దని కన్నీటి పర్యంతం

ఈ నేపథ్యంలో రేవతి భర్త భాస్కర్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా బాబు శ్రీ తేజ అల్లు అర్జున్ ఫ్యాన్. వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము...ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది.దీంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు.

She donated liver gave me life...Revathi Husband Bhasker mourns(video grab)

Hyd, Dec 6:  పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చిన ఓ మహిళ మృతి చెందిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రేవతి భర్త భాస్కర్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా బాబు శ్రీ తేజ అల్లు అర్జున్ ఫ్యాన్. వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము...ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది.దీంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే తొక్కిసలాటలో రేవతి ప్రాణాలు వదలగా బాబు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

రేవతి తన కుటుంబం కోసం జీవితాన్నే ఫనంగా పెట్టిందన భాస్కర్ కన్నీటి పర్యంత అయ్యారు. 2023లో తనకు లివర్‌ని దానం చేసి ప్రాణాలు కాపాడిందని కానీ ఇప్పుడు ఆమె లేకుండా పోయిందన్నారు. ఆమె చివరి క్షణాలను కూడా పిల్లలు చూడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.  పుష్ప 2 సినిమాకి వచ్చి నా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా, ఈ ఘటనపై అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడం దారుణమని మృతురాలి భర్త ఆవేదన, న్యాయం చేయాలని డిమాండ్

ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని...సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలని రేవతి బంధువులు కోరారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని తేల్చిచెప్పారు. బాధిత కుటంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత సినిమా నిర్మాతలపై ఉందన్నారు.



సంబంధిత వార్తలు

Rare Feat By Pushpa 2: జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ రికార్డులను బద్దలు కొట్టిన అల్లు అర్జున్, అరుదైన ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

TGSRTC Special Buses For Sankranti: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ నుంచి 6,432 ప్రత్యేక బస్సులు.. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా? టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఏమన్నారు?