Siddipet Town Gets Swachh Award: సిద్ధిపేటకు జాతీయ స్థాయిలో మరో అవార్డు, మంత్రి హరీష్ రావు ప్రశంస, మొత్తం 17 జాతీయ అవార్డులు కైవసం..
ఈ సందర్భంగా సిద్దిపేట పుర ప్రజల ఐక్యత..వారి భాగస్వామ్యం గొప్పదని.. అభివృద్ధి ..అవార్డుల్లో వారు ఎంతో స్పూర్తిని చాటుకున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
సిద్దిపేట అవార్డుల్లో ఆదర్శ పేట అని మరో సారి దేశవ్యాప్తంగా సిద్దిపేట పేరు మారు మ్రోగింది. స్వచ్ సర్వేక్షన్ 2021 అవార్డును సిద్దిపేట పట్టణం కైవసం చేసుకుంది.. ఎన్నో అవార్డులకు పెట్టింది పేరు...మంత్రి హరీష్ రావు గారి స్పూర్తితో ..వారి మార్గదర్శనంతో ఇప్పటికే పట్టణం లో 17 రాష్ట్ర జాతీయ స్థాయి అవార్థులు సాధించి దేశంలో నే శుద్దిపేట గా గుర్తింపు పొందింది. జాతీయ రాష్ట్ర స్థాయిలో సిద్ధిపేటకు ఎన్నో అవార్డు లు వచ్చాయి. 10 ఏళ్లుగా సిద్దిపేట అవార్డు ల్లో ఆదర్శంగా నిలుస్తోంది ...2012 నుండి 2021 వరకు దాదాపు 18 అవార్డు లు సిద్దిపేట పట్టణానికి దక్కాయి. స్వచ్ఛత, క్లిన్ సిటీ లో, పారిశుద్ధ్య నిర్వహణ లో, మొక్కల పెంపకంలో , ఇలా ఎన్నో అవార్డులు సాదిస్తూ సిద్దిపేట మున్సిపాల్టీ దేశానికి దశ దిశా మన సిద్దిపేట అని... సిద్దిపేట నిరంతరం చేసే నిర్వహణ భేష్ అని దక్షిణ భారత దేశం మరోసారి మెచ్చుకుంది.
శనివారం రోజున ఢిల్లీ లో ని విజ్ఞాన్ భవన్ లో అవార్డ్ ను సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల , కమిషనర్ రమణా చారి అవార్డు ను ( self sustainable ) అందుకున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట పుర ప్రజల ఐక్యత..వారి భాగస్వామ్యం గొప్పదని.. అభివృద్ధి ..అవార్డుల్లో వారు ఎంతో స్పూర్తిని చాటుకున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు..స్వచ్ సర్వేక్షన్ లో దక్షిణ భారత దేశం లోని మొదటి స్థానం లో నిలవడం పట్ల సిద్దిపేట పుర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.. సిద్దిపేట అన్నింటి లో ముందు ఉంది..స్వయం సమృద్ధిగా ఎదిగింది అని అన్నారు.. వివిధ అంశాల్లో దాదాపు 17 అవార్డులు సాదించనం మరో అవార్డు ఇప్పుడు ఎంపిక కావడం ఇది ప్రజల భాగస్వామ్యం , ప్రజాప్రతినిధులు చొరవ అధికారుల అంకిత భావం అని చెప్పారు.. స్వచ్ సర్వేక్షన్ లో ఏ కార్యక్రమం చెపితే..పిలుపు ఇస్తే ఎంతో చైతన్యాన్ని చూపారాని చెప్పారు... ఇదే స్ఫూర్తి తో పట్టణాన్ని మరింత అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలవాలని మన అందరి కృషి ఫలితంగా మరిన్ని అవార్డ్ లు సాధించాలని చెప్పారు..
సిద్దిపేట లో అభివృద్ధి లో కానీ..ఏ కార్యక్రమం చేయాలి అని కానీ మంత్రి హరీశ్ రావు గారు ఇచ్చిన స్పూర్తి ఎంతో ఉంది అని..స్వచ్ సర్వేక్షన్ లో మంత్రి గారి సూచనలు..సహాలహాలు వారు ఇచ్చిన స్పూర్తి , ప్రజల భాగస్వామ్యం మున్సిపల్ అధికారులు పని తీరు కు నిదర్శనం అని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు మరియు కమిషనర్ రమణాచారి లు చెప్పారు..
సిద్దిపేట మునిసిపాలిటీ అవార్డు లు.. 18 అవార్డులు..
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
- 2012 - క్లిన్ సిటీ ఛాంపియన్ షిప్ అవార్డు - రాష్ట్ర స్థాయి.
- 2015 - ఎక్సలెన్స్ అవార్డు ( సాలీడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ ) - జాతీయ స్థాయి
- 2016 - ఎక్స్ లెన్స్ అవార్డు పారిశుద్ధ్య నిర్వహణ - జాతీయ స్థాయి
- 2016 - హరిత మిత్ర అవార్డ్ రాష్ట్ర స్థాయి
- 2016 స్కాచ్ అవార్డు చెత్త సేకరణ, 100% మరుగుదొడ్ల నిర్మాణం లో జాతీయ స్థాయి అవార్డ్
- 2016 ఒడిఫ్ సర్టిఫికెట్ జాతీయ స్థాయిలో ...
- 2016 ఎక్స్ లెన్స్ అవార్డు రాష్ట్ర స్థాయిలో ..
- 2017 రాష్ట్రీయ స్వచ్ భారత్ పురస్కార్ జాతీయ స్థాయి
- 2017 బెస్ట్ మున్సిపాలిటీ అవార్డ్ సీఎం గారిచే రాష్ట్ర స్థాయి అవార్డు ..
- 2017 iso అవార్డు జాతీయ స్థాయి
- 2018 - సాలీడ్ మేనేజ్మెంట్ లో స్కాచ్ అవార్డ్ జాతీయ స్థాయి
- 2018 స్వచ్ఛత ఎక్స్ లెన్స్ అవార్డు జాతీయ స్థాయి
- 2018 స్కోచ్ అవార్డ్ 6 పద్ధతులు అమలు లో ఉన్నందున జాతీయ స్థాయి
- 2018 స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం..
- 2019 స్వచ్చత ఎక్స్ లెన్స్ అవార్డ్ జాతీయ స్థాయిలో
- 2019 స్వచ్ సర్వేక్షన్ అవార్డ్ జాతీయ స్థాయిలో ...( దక్షిణ భారత దేశంలో రెండవ స్థానంలో )
- 2021 సిద్దిపేట పట్టణం లో 100% ఇంటింటికి స్వచ్చ మైన త్రాగు నీటి సరఫరా నిర్వహణ కు రెండు స్కాచ్ అవార్డ్ లు వచ్చాయ్..
- 2021 దేశ స్థాయిలో స్వచ్ సర్వేక్షన్ అవార్డు కు ఎంపిక...