Tech CEO Kidnap: హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ సంస్థ సీఈఓను కిడ్నాప్ చేసిన కన్సల్టెన్సీ సిబ్బంది.. 5 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

చాకచక్యంగా నిందితులను గుర్తించి వారి చెర నుంచి సీఈఓను కాపాడారు.

Representational Image (File Photo)

Hyderabad, July 13: హైదరాబాద్ (Hyderabad) కు చెందిన ఓ టెక్ కంపెనీ సీఈఓ కిడ్నాప్ (Tech CEO Kidnap) కేసును కేవలం ఐదంటే ఐదు గంటల్లోనే జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. చాకచక్యంగా నిందితులను గుర్తించి వారి చెర నుంచి సీఈఓను కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌ లోని హుడా ఎన్‌ క్లేవ్ నందగిరిహిల్స్‌ లో వాకటి రవిచంద్రారెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నివాసం ఉంటున్నారు. కొంతకాలం ఉద్యోగం చేసిన రవి.. టీ-హబ్ సమీపంలోని ఆర్బిట్‌ మాల్‌ లో ‘గిగ్లైజ్’ పేరుతో గత నవంబరులో సాఫ్ట్‌ వేర్ సంస్థ ప్రారంభించారు. కన్సల్టెన్సీల ద్వారా 1500 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి దశలవారీగా ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. డిసెంబర్ ఒక్క నెల జీతాలు ఇచ్చి జనవరి నుంచి చెల్లించడం లేదు. దీంతో ఉద్యోగులు అటు సంస్థ నిర్వాహకులపై, ఇటు కన్సల్టింగ్ సిబ్బందిపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఇదే విషయమై కన్సల్టింగ్ సిబ్బంది రవితో పలుమార్లు వాగ్వివాదానికి దిగారు. రవి మాత్రం పట్టించుకోలేదు.

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన‌, ఉక్క‌పోత నుంచి న‌గ‌ర‌వాసుల‌కు ఉప‌శ‌మ‌నం

అలా తరలించారు..

దీంతో.. గత మంగళవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రవి ఇంటికి ఎనిమిది మంది కన్సల్టింగ్ సిబ్బంది వచ్చి.. కాసేపు మాట్లాడాక వారు రవిని అతడి స్నేహితుడు మోహన్‌ ను బలవంతంగా కార్లలో తీసుకెళ్లారు. నగరంలో పలు ప్రాంతాలు తిప్పి చివరకు నాగర్‌ ‌కర్నూల్ జిల్లా ఒంగూరులోని ఓ హోటల్‌ కు తీసుకెళ్లి బంధించారు. అంతకుముందే టాయిలెట్ పేరుతో మోహన్ కారులోంచి దిగి పారిపోయాడు. మరోవైపు, కుమారుడు ఎంతకీ తిరిగిరాకపోవడంతో రవి తల్లి గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి 10 గంటలకల్లా నిందితులున్న ప్రాంతాన్ని గుర్తించి వారందరినీ అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.

హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్ దారుణ హత్య, నిర్మానుష్య ప్రాంతంలో ముక్కలుముక్కలుగా నరికి చంపిన దుండగులు  

మరో ట్విస్ట్..

ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారంటూ సంస్థ ఉద్యోగులు శుక్రవారం ఠాణా వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ నుంచి రూ.15 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు.  ఆ డబ్బుతో ఏపీ ఎన్నికల్లో రవి, అతడి సోదరి పోటీ చేసి ఓడిపోయారని పేర్కొన్నారు. అయితే, నియామకాలు చేసుకున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వని కారణంగానే మాట్లాడటానికి తీసుకెళ్లామని అరెస్ట్ అయిన కన్సల్టింగ్ కంపెనీ సిబ్బంది పోలీసులకు తెలిపారు.