Hyderabad-Delhi Cargo Express: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌ రైలు, సనత్ నగర్ నుంచి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే, కనిష్టంగా 60 టన్నుల వరకు బుకింగ్ సదుపాయం

ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం సనత్‌నగర్‌ స్టేషన్‌లో బయలుదేరే ఈ సరుకు రవాణా రైలు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌ స్టేషన్‌కు (Sanath Nagar in Hyderabad to Adarsh Nagar in New Delhi) చేరుకుంటుంది. సరుకు రవాణా రేక్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకునే విధానానికి భిన్నంగా కనిష్టంగా 60 టన్నుల సరుకైనా బుక్‌ చేసుకునే సదుపాయం రైల్వే కల్పించింది.

Hyderabad-Delhi Cargo Express (photo credit-South Central Railway Twitter)

Hyderabad, August 5: దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌ రైలును (Hyderabad-Delhi Cargo Express) తెలంగాణలోని సనత్‌నగర్‌ స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం సనత్‌నగర్‌ స్టేషన్‌లో బయలుదేరే ఈ సరుకు రవాణా రైలు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌ స్టేషన్‌కు (Sanath Nagar in Hyderabad to Adarsh Nagar in New Delhi) చేరుకుంటుంది. సరుకు రవాణా రేక్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకునే విధానానికి భిన్నంగా కనిష్టంగా 60 టన్నుల సరుకైనా బుక్‌ చేసుకునే సదుపాయం రైల్వే కల్పించింది.

ఎంత సరుకు లోడ్‌ అయిందన్న విషయంతో ప్రమేయం లేకుండా నిర్ధారిత సమయాల ఆధారంగా రైలు నడుస్తుంది. ఇంతకాలం చిన్న వ్యాపారులు ఢిల్లీకి సరుకు పంపాలంటే రోడ్డు మార్గాన పంపాల్సి వచ్చేది. లక్షలకు చేరువలో కరోనా కేసులు, 40 వేలు దాటిన మరణాలు, గత 24 గంటల్లో 56,282 కోవిడ్-19 కేసులు నమోదు

ఇప్పుడు రైలు అందుబాటులోకి రావటంతో ఖర్చులో 40 శాతం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ సరుకు రవాణా రైలును సనత్ నగర్ నుంచి నిన్న బయలుదేరింది.

Here's SouthCentralRailway Tweet

ఈ మార్గంలో ప్రయోగాత్మకంగా ఆరునెలలపాటు కార్గో రైలు ను నడిపించనున్నారు. టైంటేబుల్‌ ఎక్స్‌ప్రెస్‌గా ఉండే ఈ రైలు వారానికి ఒకసారి నడువనున్నది. రోడ్డు రవాణా లేదా రైల్వే పార్శిల్‌ చార్జీలతో పోల్చితే కార్గో ఎక్స్‌ప్రెస్‌ ద్వారా40 శాతం తక్కువ ధరకే వేగవంతమైన రవాణా సదుపాయం అందనున్నది. రైల్వే ద్వారా సరుకు రవాణా భద్రతతో కూడుకొన్నదని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య తెలిపారు.