Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి 26 ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంకు రైళ్లు.. ఈ నెల 20 నుంచి జనవరి 17వ తేదీ వరకు అందుబాటులో.. కాచిగూడ, నల్గొండ, కాజీపేట మార్గంలో ప్రయాణించనున్న రైళ్లు

శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. శబరిమల వెళ్లి వచ్చే భక్తుల కోసం మొత్తంగా 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

File Image (Credits: Google)

Hyderabad, Nov 11: శబరిమల (Sabarimala) భక్తులకు (Devotees) దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త (Good News) తెలిపింది. శబరిమల వెళ్లి వచ్చే భక్తుల కోసం మొత్తంగా 26 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడుపుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి కొల్లాం, కొట్టాయంకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

సీసీటీవీ పుటేజీలో ఇద్దరు అమ్మాయిల దృశ్యాలు, తిరుపతిలో మిస్సయిన అయిదుగురు విద్యార్థులు ఏమయ్యారు, రంగంలోకి దిగిన పోలీసులు

రైళ్ల వివరాలు, బయల్దేరే ప్రాంతాలు, చేరే సమయాలు, తిరిగివచ్చే షెడ్యూల్ ఇలా ఉంది..

  • సికింద్రాబాద్-కొల్లాం (07117) రైలు ఈ నెల 20, డిసెంబరు 4, 18, జనవరి 8 తేదీల్లో సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తర్వాతి రోజు రాత్రి 11 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇది కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల మీదుగా ప్రయాణిస్తుంది.  తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07118) నవంబరు 22 డిసెంబరు 6, 20, జనవరి 10 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లాంలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
  • సికింద్రాబాద్-కొల్లాం (07121) రైలు నవంబరు 27, డిసెంబరు 11, 25, జనవరి 1, 15 తేదీల్లో మధ్యాహ్నం సికింద్రాబాద్‌లో బయలుదేరి తర్వాతి రోజు రాత్రికి కొల్లాం చేరుకుంటుంది. ఇది కాజీపేట, ఖమ్మం మార్గాల్లో ప్రయాణిస్తుంది. కొల్లాం-సికింద్రాబాద్ (07122) రైలు నవంబరు 29, డిసెంబరు 13, 27, జనవరి 3, 17 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 10 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
  • సికింద్రాబాద్-కొల్లాం (07123) రైలు నవంబరు 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 11.50 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. కొల్లాం-సికింద్రాబాద్ (07124) రైలు నవంబరు 23, 30 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 11 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
  • ఇక, సికింద్రాబాద్ నుంచి కొట్టాయం వెళ్లే రైలు (07125) నవంబరు 20, 27 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 9 గంటలకు కొట్టాయం చేరుతుంది. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ మార్గంలో ప్రయాణిస్తుంది. కొట్టాయం నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు (07126) నవంబరు 21, 28 తేదీల్లో సోమవారం రాత్రి 11.20 గంటలకు బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన

Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్‌, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి

Rules Change In Railways: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

Advertisement
Advertisement
Share Now
Advertisement