No Number Plate: వాహనాలకు నంబరు ప్లేట్లు లేకపోతే కఠిన చర్యలు: ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్
వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోతే భారీ జరిమానాతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ హెచ్చరించారు.
Hyderabad, Nov 24: నంబర్ ప్లేట్లు (Number Plates) లేని వాహనదారులపై కఠిన చర్యలకు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) సిద్ధమవుతున్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోతే భారీ జరిమానాతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ హెచ్చరించారు. అర్ధరాత్రుళ్లు బైక్ రేసుల పేరిట రోడ్లపై వికృత విన్యాసాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జోయెల్ డేవీస్ మాట్లాడారు.
పెండింగ్ చలాన్ల వసూలు కూడా
ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు రోడ్డు వెడల్పు, ప్యాచ్ వర్క్స్ పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు అధిక బలగాలను మోహరింప చేయాలని, పెండింగ్ చలాన్ల వసూళ్లకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.