Summer Holidays in TS: ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు, తెలంగాణలో ఏప్రిల్ 26వ తేదీ ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినం, తిరిగి స్కూళ్లు ఎప్పుడు తెరిచేది జూన్ 1న ప్రకటిస్తామని తెలిపిన సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు (Summer Holidays in TS) ఇస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి (Education minister sabitha indra reddy) వెల్లడించారు.

File image of Minister Sabitha Indra Reddy | File Photo.

Hyderabad, April 25: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు (Summer Holidays in TS) ఇస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి (Education minister sabitha indra reddy) వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై సీఎం కేసీఆర్ (CM KCR), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు.

కరోనా విస్తరిస్తున్న‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ – 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణలో కరోనాతో డాక్టర్ మృతి, టీకా తీసుకున్న తరువాత భార్యభర్తలు మృతి, తాజాగా 8,126 మందికి కరోనా, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా టీకా తీసుకునేవారి సంఖ్య

ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామన్నారు. అలాగే 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను ఎప్పుడు తెరిచేది కోవిడ్-19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement