Coronavirus in India (Photo Credits: PTI)

Hyderabad, April 25: తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 8,126 మందికి కరోనా పాజిటివ్ (TS Coronavirus) నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 3,307 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,95,232కి (Covid Cases in TS) చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,30,304 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,999గా (Covid Deaths) ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 62,929 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,259 మందికి క‌రోనా సోకింది.

జగిత్యాల జిల్లాలో కోడిమ్యాల మండలానికి చెందిని టీఆర్ఎస్ అధ్యక్షుడు పూడూర్ ఎంపీటీసీ రఘు కరోనా బారినపడ్డారు. వారం క్రితం జలుబు, దగ్గు, ఫీవర్ రావడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ అని తెలడంతో ఆస్పతిలో చేరారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఎంపీటీసీ రఘు మృతి చెందిన విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‎ సంతాపం తెలిపారు.

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్, ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు స్కానింగ్‌లో నిర్థారణ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్‎తో ఐదుగురు మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసులు 1,514 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండలో 765, సూర్యాపేట 322, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నెక్కొండకు చెందిన పుట్టపాక అంజమ్మ (58), వెంకటయ్య (67) దంపతులు ఈనెల 19న స్థానిక పీహెచ్‌సీకి కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్లారు. అదే సెంటర్‌లో కరోనా టీకా సైతం తీసుకున్నారు. కాగా, అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై అంజమ్మ మృతి చెందింది. అప్పటినుంచి జ్వరంతో బాధపడుతూ, మనోవేదనకు గురైన భర్త వెంకటయ్య శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు.

టీకా కోసం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించకుండా వ్యాక్సిన్‌ వేయడంతోనే వృద్ధ దంపతులు మృతిచెందారని గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ రమేశ్‌ను వివరణ కోరగా, వృద్ధాప్యంలో వచ్చే హార్ట్‌ స్ట్రోక్‌తో మృతి చెంది ఉండవచ్చనని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్, ఇందుకోసం రూ. 2,500 కోట్లు ఖర్చు చేయనున్న కేసీఆర్ సర్కారు, మరో రెండు రోజుల్లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని వాసవీనగర్‌ కాలనీకి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ కిష్టయ్య 25 ఏళ్లుగా బొడ్మట్‌పల్లి గ్రామంలో క్లినిక్‌ను ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 20-30 గ్రామాల్లో ఆయన వైద్యంపై అపార నమ్మకం. కిష్టయ్యకు కరోనా సోకడంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఆయన కుమారులు హైదరాబాద్‌కు తరలించారు. 20కి పైగా ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా బెడ్స్‌ దొరకలేదు. చివరికి శనివారం తెల్లవారుజామున ఓ ఆస్పత్రిలో బెడ్‌ దొరగ్గానే వెంటనే చేర్చారు. అయితే వైద్యులు నాడి చూసేసరికే శ్వాస ఆగిపోయింది. డాక్టర్‌ కిష్టయ్య జోగిపేట లైన్స్‌క్లబ్‌ సభ్యుడిగా కూడా ఉన్నారు.

హైదరాబాద్‌కు చెందిన బయొలాజికల్‌-ఈ (బీఈ) కంపెనీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తో మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించడానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ) నిపుణుల కమిటీ అనుమతులు మంజూరు చేసింది. మూడో దశ ప్రయోగ పరీక్షలను దేశవ్యాప్తంగా 15 చోట్ల నిర్వహించనున్నట్లు బయొలాజికల్‌-ఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమ దాట్ల చెప్పారు.

ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ భద్రత, రోగ నిరోధక ప్రతిస్పందనలను తెలుసుకోవడానికి 18-80 ఏళ్లలోపు 1,268 మంది వలంటీర్లపై దాన్ని పరీక్షించనున్నట్లు తెలిపారు. మూడో దశ పరీక్షలను పూర్తి చేసుకుని బీఈ వ్యాక్సిన్‌ ఆగస్టుకల్లా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. బయొలాజికల్‌-ఈకి నెలకు 7 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.

రాష్ట్రంలో కరోనా టీకా తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం 1,450 ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో 2,02,817 మంది వ్యాకిన్‌ వేయించుకున్నారు. రెండు లక్షల మందిపైగా టీకా పొందడం వరుసగా ఇది రెండో రోజు. కాగా, వీరిలో 1,79,175 మంది మొదటి డోసు, 23,642 మంది రెండో డోసు తీసుకున్నారు. దీంతో తొలి డోసు వేయించుకున్నవారి సంఖ్య 33,38,955కు, రెండో డోసు పొందినవారి సంఖ్య 4,66,596కు చేరింది.

మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రానికి 39,98,990 డోసులు వచ్చాయి. శనివారం సాయంత్రం వరకు 38,44,860 డోసులు ఇచ్చారు. ఇంకా 1,54,130 టీకాలు ఉన్నాయి. ఇవి ఒకటి, రెండు రోజులకే సరిపోతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. మళ్లీ కేంద్రం నుంచి వస్తేనే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపాయి. వ్యాక్సిన్‌ వృథా 1.02 శాతమని పేర్కొన్నాయి.