Uttam Kumar Reddy Covid: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్, ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు స్కానింగ్‌లో నిర్థారణ

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.

Uttam Kumar Reddy Covid: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్, ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు స్కానింగ్‌లో నిర్థారణ
Telangana PCC chief Chief Uttam Kumar Reddy | (Photo Credits: ANI)

స్కానింగ్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు తేలడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరారు. తెలంగాణలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ప్రమాదంలో పడతారని శుక్రవారమే ఉత్తమ్‌ అన్నారు. ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం సబబు కాదని తెలుపుతూ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఆయన లేఖ కూడా రాశారు.

Here's Uttam Kumar Reddy Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 24, 2021 09:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).