Supreme Court Notice To Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు, ప్రతివాదులకు నోటీసులు జారీ
కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadeesh reddy) గతంలో సుప్రీంలో పిటిషన్ వేశారు
New Delhi, FEB 09: ఓటుకు నోటు కేసులో (Vote For Cash) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadeesh reddy) గతంలో సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలని సూచనలు చేసింది. గతంలో ఈ కేసులో రేవంత్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను రేవంత్ రెడ్డి కలిసి.. డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే, మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా నిలిచింది.