Banjarahills Land Dispute Case: ఆత్మహత్య చేసుకున్న షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త, ఏసీబీ అదుపులో ఎమ్మార్వో సుజాత, ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్న పోలీసులు

బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో (Banjarahills Land Dispute Case) ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ షేక్‌పేట ఎమ్మార్వో సుజాత (Sheikhpet Tahasildar Sujatha) భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మార్వో సుజాత భర్త అజయ్‌ కుమార్‌ బుధవారం గాంధీనగర్‌లోని తన సోదరి నివసిస్తున్నఅయిదంతస్తుల భవనం పైనుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Hyderabad June 17: బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో (Banjarahills Land Dispute Case) ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ షేక్‌పేట ఎమ్మార్వో సుజాత (Sheikhpet Tahasildar Sujatha) భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మార్వో సుజాత భర్త అజయ్‌ కుమార్‌ బుధవారం గాంధీనగర్‌లోని తన సోదరి నివసిస్తున్నఅయిదంతస్తుల భవనం పైనుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. సరిహద్దుల్లో తెలుగు బిడ్డ వీర మరణం, కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్ బాబు చైనా సరిహద్దు ఘర్షణల్లో మృతి, దేశం కోసం అమరుడయ్యాడన్న కల్నల్ తల్లి

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. కాగా ఈ కేసులో అజయ్‌ను (Sujatha’s husband Ajay Kumar) కూడా గతంలో ఏసీబీ విచారణ చేసింది. భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం​.

రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్‌ భూవివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు ఇదివరకే అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల సుజాతను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. సుదీర్ఘంగా విచారించి భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆమె నివాసంలో ప‌ట్టుబ‌డ్డ రూ.30 లక్షల డబ్బు సహా పలు అంశాలపై ఆరా తీశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లో వివాదంలో ఉన్న ఎకరం భూమి విషయంలో లంచం డిమాండ్ చేశారని తెలుస్తోంది.

Here's Tweet

బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లో రూ. 50 కోట్ల విలువైన భూవివాదాన్ని పరిష్కరిస్తానంటూ ఖాలీద్‌ అనే వ్యక్తి నుంచి ఆర్‌ఐ నాగార్జున రెడ్డి రూ. 30 లక్షలు డిమాండ్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటున్న ఆర్‌ఐ నాగార్జున రెడ్డి, కేసు మాఫీ చేస్తానంటూ రూ. 3 లక్షలు డిమాండ్‌ చేసిన ఎస్‌ఐ రవీంద్ర నాయక్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఉన్నతాధికారుల ప్ర‌మేయం ఉండొచ్చనే అనుమానంతో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో ఆమె నివాసంలో అధికారులు సోదాలు చేయగా రూ. 30 లక్షలు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి.

విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మార్వో సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు ఆధారాలు చూపలేకపోయారని సమాచారం. మరోవైపు సుజాత ఇంట్లో షేక్‌పేట్‌కు చెందిన మరికొన్ని ల్యాండ్‌ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్‌లిస్ట్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో వసంత కుమారిని అధికారులు విచారించారు. ఇదే కేసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ షేక్‌పేట ఆర్‌ఐ నాగార్జున రెడ్డి (Shaikhpet Revenue Inspector Nagarjuna Reddy

), బంజారాహిల్స్‌ సెక్టార్‌ ఎస్‌ఐ రవీంద్ర నాయక్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు త‌ర‌లించారు. ఈ కేసులో ఎమ్మార్వో సుజాత ఇప్పుడు విచార‌ణ ఎదుర్కోంటుంన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now