IAS Officers Transferred: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీలు, 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

ఈమేరకు 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ (IAS Officers Transferred) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల కలెక్టర్‌ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రెటరీగా నియమించింది

TSPSC notifies 1,392 junior lecturer posts

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈమేరకు 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ (IAS Officers Transferred) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల కలెక్టర్‌ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రెటరీగా నియమించింది. హన్మకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతును నిజామాబాద్‌కు బదిలీ చేసింది. అమయ్‌కుమార్‌ను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా నియమించడంతో పాటు హైదరాబాద్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఐటీ దాడులు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని కార్యాలయాలపై దాడులు నిర్వహించిన ఐటీ

► ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భారతీ హోలికెరి.. మహిళా శిశు సంక్షేమ వాఖ స్పెషల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.

► ప్రస్తుత హన్మకొండ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు.. నిజామాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ.

► ప్రస్తుత ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌.. హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ.

► ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ మేడ్చల్‌ కలెక్టర్‌గా బదిలీ.

► ప్రస్తుత వనపర్తి జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా.. కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ.

► ప్రస్తుత జగిత్యాల జిల్లా కలెక్టర్‌ జీ రవి.. మహబూబ్‌నగర్‌ కలెకర్ట్‌గా బదిలీ.

► ప్రస్తుత మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు.. సూర్యాపేట కలెక్టర్‌గా బదిలీ.

► ప్రస్తుత మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ హరీష్‌.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ.

► జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ బి సంతోష్‌.. మంచిర్యాల కలెక్టర్‌గా బదిలీ.

► ప్రస్తుత సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ రాజార్షి షా.. మెదక్‌​ జిల్లా కలెక్టర్‌గా బదిలీ.

► ప్రస్తుత నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి.. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ.

► ప్రస్తుత కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌కు జగిత్యాల ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు.

► ఐటీడీఏ ఉట్నూర్‌ ప్రాజెక్ట్‌ అధికారి వరుణ్‌ రెడ్డి.. నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ

► ప్రస్తుత కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ

► ప్రస్తుత మహబూబ్‌ నగర్‌ అదనపు కలెక్టర్‌ తేజాస్‌ నందలాల్‌ పవార్‌.. వనపర్తి కలెక్టర్‌గా బదిలీ