TRS Party Plenary 2021: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, 21వ వసంతంలోకి అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, గులాబిమయమైన హైదరాబాద్, మరోసారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్ బాధ్యతలు

రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని (20 Years of TRS Party) పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధుల సభ (ప్లీనరీ) సోమవారం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనుంది.

CM KCR Press Meet | File Photo

Hyd, Oct 25: టీఆర్‌ఎస్‌ 20వ సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా ప్లీనరీ పండుగకు (TRS Party Plenary 2021) గ్రేటర్‌ సిద్ధమైంది. రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని (20 Years of TRS Party) పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధుల సభ (ప్లీనరీ) సోమవారం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. వరుసగా 9వ సారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌ ప్లీనరీ వేదికగా బాధ్యతలు స్వీకరిస్తారు. వచ్చే 9 నెలల పాటు పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేస్తామని పార్టీ అధినేత కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు.

హైదరాబాద్‌ వ్యాప్తంగా గులాబీ తోరణాలు (city turns pink) కట్టడంతోపాటు కేసీఆర్‌, కేటీఆర్‌ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ప్రధాన రహదారుల వెంట కటౌట్లు ఏర్పాటు చేశారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం 9 రకాల నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌ సహా 33 రకాల వంటకాలతో మెనూ సిద్ధం చేశారు. ఇందులో తెలంగాణ వంటకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. బందోబస్తు ఏర్పాట్లపై హైటెక్స్‌లో సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సమీక్ష నిర్వహించారు. 2,200మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ప్లీనరీకి భారీ సంఖ్యలో వాహనాలు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు.

Here's Trs Party Plenary Updates

కాగా, ప్లీనరీ ఏర్పాట్లను ఎంపీ సంతోష్‌ ఆదివారం పరిశీలించారు. ప్లీనరీ సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రులు జగదీశ్‌ రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌ సైతం సభా వేదికను సందర్శించి.. భోజన ఏర్పాట్లు, అతిథుల రిజిస్ట్రేషన్‌, పార్కింగ్‌ ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, టీఆర్‌ఎస్‌ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, ఏడేళ్ల ప్రభుత్వ ప్రస్థానం అద్భుతమని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ ద్విదశాబ్ది వేడుకల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

రెండు దశాబ్దాల టీఆర్ఎస్, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్సవాలు

పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ప్లీనరీ వేదికపై టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసీనులు కానున్నారు. వీరందరికీ సౌకర్యంగా ఉండేలా సభా వేదికను విశాలంగా సిద్ధం చేశారు. వేదికపై అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటుచేశారు. కాకతీయ కళా తోరణం, హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి, ద్విదశాబ్ది ఉత్సవాల లోగో, తెలంగాణ తల్లి, సీఎం కేసీఆర్‌ బొమ్మలతో అలంకరించారు. వేదికపై సీఎం కేసీఆర్‌ పార్టీ జెండాను ఎగరవేస్తారు. ప్లీనరీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ హైటెక్స్‌ ప్రాంగణంలో భారీ కాకతీయ కళాతోరణం, దాని ముందు కాళేశ్వరం ప్రాజెక్టు మోడల్‌ను ఏర్పాటుచేశారు.