Telangana: తాగిన మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కూలీ, మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఘటన, మరో చోట భార్య కాపురానికి రావడంలేదని బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న భర్త
దానికి తోడు మద్యానికి బానిస (drinking alcohol) అయ్యాడు. శనివారం రాత్రి తాగిన మైకంలో అర్ధరాత్రి వేళ పక్కన ఉన్న రేకుల షెడ్డు లో ఉరి వేసుకొని ఆత్మహత్య ( insane person committed suicide) చేసుకున్నాడు.
Hyd, Dec 6: తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ కూలీ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద కర ఘటన ముబారక్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్నారివెల్లికి చెందిన యాదిష్ వెంకటయ్య(40) కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బతుకుదెరువు కోసం భార్య యాదమ్మ, కూతుళ్లు సంతోష, సంధ్య, కుమారుడు శ్రీరామ్‌తో కలిసి నవాబుపేట మండలం ముబారక్ పూర్ గ్రామానికి వలస వచ్చి ఉంటున్నారు.
గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో పని చేస్తున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు అతను కింద పడటంతో తలకు గాయమైంది. అప్పటి నుంచి వెంకటయ్యకు మతిస్థిమితం సరిగ్గా పనిచేయడం లేదు. దానికి తోడు మద్యానికి బానిస (drinking alcohol) అయ్యాడు. శనివారం రాత్రి తాగిన మైకంలో అర్ధరాత్రి వేళ పక్కన ఉన్న రేకుల షెడ్డు లో ఉరి వేసుకొని ఆత్మహత్య ( insane person committed suicide) చేసుకున్నాడు. మృతుని భార్య యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వెంకటేశం తెలిపారు.
చిత్తూరులో ఘోర ప్రమాదం, చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం, కల్వర్టును ఢీకొట్టి కారులో చెలరేగిన మంటలు
ఇక తూప్రాన్ మండలంలోని చెట్లగౌరారంలో భార్య కాపురానికి రావడంలేదని తీవ్ర మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెట్ల గౌరారం గ్రామానికి చెందిన డ్రైవర్ బాబర్(30)తో తూప్రాన్‌కు చెందిన నూర్జహాన్ బేగంతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరు నెలలుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. భర్తతో గొడవపడి నూర్జహాన్ బేగం పుట్టింకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాబర్ మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈనెల 2న డ్యూటీకి వెళ్తున్నట్లు ఇంటిలో చెప్పి తిరిగిరాలేదు. మక్సాని కుంటబావిలో ఆదివారం శవమై తేలాడు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. మృతుడి తండ్రి మౌలానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.